జయరామ్ మృతి : హత్య తరువాత పోలీసుల సాయం! రాకేష్ రెడ్డి వెల్లడి! ఆ ఇద్దరు ఎవరు!

Jayaram-Chigurupati-mudder-1
- Advertisement -

jayarammudder mistary reveld

గత ఐదు రోజులుగా పోలీసులకి నిద్రలేకుండా చేస్తున్న ప్రముఖ పారిశ్రామిక వేత్త జయరామ్ హత్య కేసు గంటకో మలుపు తిరుగుతుంది . తాజాగా మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. జయరామ్ ను హత్య చేసిన తరువాత, మృతదేహాన్ని తెలంగాణ దాటించేందుకు హైదరాబాద్ కు చెందిన ఇద్దరు పోలీసులు సహాయం చేసారని తెలుస్తోంది.

జయరామ్ కేసులో కొత్త కోణం…

ఆ ఇద్దరు అధికారులు సలహాలు, సూచనలు ఇచ్చారని, వారిచ్చిన సూచనలతోనే, తాను రాత్రిపూట కారులో జయరామ్ మృతదేహంతో నందిగామ చేరుకున్నానని పోలీసుల విచారణలో రాకేశ్ రెడ్డి వెల్లడించినట్టు సమాచారం. దీంతో వారిద్దరిపైనా హైదరాబాద్ కమిషనర్ కు నందిగామ పోలీసులు ఫిర్యాదు చేశారు. జయరామ్ మృతదేహాన్ని ఎలా తరలించాలన్న విషయమై వారు పలుమార్లు రాకేశ్ తో మాట్లాడారని, రాకేశ్ ఫోన్ లో వారి నంబర్లు ఉన్నాయని వెల్లడించారు.

ఈ కేసులో వారిని ప్రశ్నించాల్సి వుందని స్పష్టం చేశారు. కాగా, గత రాత్రి శిఖా, రాకేశ్ లను ఎదురెదురుగా కూర్చోబెట్టి, పలు పాత విషయాలపై కూపీ లాగిన పోలీసులు, హత్య తరువాత ఆ విషయాన్ని శిఖాకు రాకేశ్ చెప్పాడని కూడా తేల్చారు. ఆ తరువాతే శిఖాను రహస్యంగా మరో ప్రాంతానికి తరలించారు. నేటి మధ్యాహ్నం నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి, హత్యోదంతాన్ని వెల్లడిస్తామని చెప్పిన నందిగామ పోలీసులు, మీడియా సమావేశాన్ని సాయంత్రానికి వాయిదా వేయడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది.

చదవండి : శిఖా చౌదరిని రహస్యంగా తరలించిన పోలీసులు! కారణం ఏంటి!

ఎన్నారై చిగురుపాటి జయరాం అనుమానాస్పద మృతి.. కారు వెనుక సీటులో మృతదేహం!

చిగురుపాటి హత్య కేసు: రంగు మారిన మృతదేహం.. విషప్రయోగం జరిగి ఉంటుందా? పోలీసుల అనుమానం…

- Advertisement -