‘ఆర్ఆర్ఆర్’ ఫ్రెండ్‌షిప్ డే పోస్టర్ వెనకున్న రహస్యం ఇదా?

- Advertisement -

హైదరాబాద్: టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ఆర్.ఆర్.ఆర్. సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించిన ఒకే ఒక్క పోస్టర్‌ ఇప్పటి వరకు యూనిట్ విడుదల చేసింది. తాజాగా నిన్న స్నేహితుల దినోత్సవం రోజున మరో ఆసక్తికరమైన పోస్టర్‌ను సినిమా యూనిట్ విడుదల చేసింది.

“మంచి స్నేహం ఎప్పుడూ అనుకోకుండానే మొదలవుతుంది. రామరాజు, భీంల స్నేహంలా.. మీ జీవితంలో అనుకోకుండా ఓ స్నేహితుడిని కలిసి ఉంటారు. అలా కలిసిన వ్యక్తుల్లో మీ జీవితంలో మీకు అత్యంత ఆప్తుడైన స్నేహితుడు ఎవరు? ఈ స్నేహితుల దినోత్సవం సందర్భంగా అతనితో దిగిన ఫొటోను మాతో పంచుకోండి” అంటూ ఓ పోస్టర్‌కు కామెంట్‌ను జత చేసింది. ఈ పోస్టర్ బ్యాక్ గ్రౌండ్ల‌లో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫోటో ఉన్నారు.

1920 కాలం నాటి కథతో సినిమాను తెరకెక్కిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు ఆంధ్రా ప్రాంతానికి చెందిన వ్యక్తి అయితే.. కొమరం భీం తెలంగాణాకు చెందిన వ్యక్తి.. ఈ ఇద్దరు ఎలా కలిశారు అన్నది సస్పెన్స్. చారిత్రాత్మకంగా కూడా అలాగే జరిగిందా లేదంటే కేవలం సినిమా కోసమే ఇలా మార్చారా అన్నది తెలియాలంటే 2020, జులై 30 వరకు ఆగాల్సిందే.

- Advertisement -