జమ్మూ కశ్మీర్‌లో మారణహోమానికి కారణం ఆర్టికల్ 370: లోక్‌సభలో అమిత్ షా

central-home-minister-amit-shah
- Advertisement -

న్యూఢిల్లీ: ఏడు దశాబ్దాలుగా జమ్మూ కశ్మీర్‌లో జరుగుతోన్న మారణహోమానికి రాజ్యంగంలోని ఆర్టికల్ 370యే కారణమంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సంచలన ఆరోపణలు చేశారు. అసలు ఆర్టికల్ 370 ద్వారా కశ్మీర్ ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదంటూ ఆయన దుయ్యబట్టారు.  

సోమవారం ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించిన తీర్మానాన్ని లోక్‌సభలో ప్రవేశపెట్టిన సందర్భంగా మాట్లాడుతూ జమ్మూ కశ్మీర్ విభజన బిల్లుపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. 1950 నుంచి నేటి వరకు కశ్మీర్ నెత్తురోడుతూనే ఉందన్నారు.

ఆర్టికల్ 370 రద్దు వల్ల కశ్మీర్ ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే ఆర్టికల్ 370 కారణంగా ఎందరో ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. 1950 నుంచి ఇప్పటి వరకు జమ్మూ కశ్మీర్‌లో రక్తపాతం కొనసాగుతూనే ఉందని అమిత్ షా ఆరోపించారు.

ఆర్టికల్ 370, 35ఏ జమ్మూకశ్మీర్, లడఖ్ ప్రాంతాలకు తీవ్ర నష్టాన్ని కల్గించాయని వ్యాఖ్యానించిన ఆయన అక్కడి ప్రజల మరణాలకు ఎవరు బాధ్యత వహిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆర్టికల్ 370 రద్దుపై ఎలాంటి అపోహలు వద్దన్నారు. ఈ చర్య వల్ల కశ్మీర్ ప్రజల్లో మార్పు వస్తుందని తమ ప్రభుత్వం భావిస్తున్నట్లు చెప్పారు. 

- Advertisement -