అమెరికాలో రోడ్డు ప్రమాదం… టీడీపీ నేత డాక్టర్ ఎంవీవీఎస్ మూర్తి దుర్మరణం

gitam-founder-mvss-prasad
- Advertisement -

gitam-prasad-accident

అమెరికాలోని ఆంకరేజ్ నగరంలో గీతం వర్సిటీ అధ్యక్షుడు డాక్టర్ ఎంవీవీఎస్ మూర్తి ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైన దృశ్యం

- Advertisement -

వాషింగ్టన్: ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎంపీ, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ, గీతం విశ్వవిద్యాలయం వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ ఎంవీవీఎస్ మూర్తి అమెరికాలోని ఆంకరేజ్ నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఆయన తన స్నేహితులతో కలసి హాలీడే ట్రిప్ కోసం వైల్డ్‌లైఫ్ సఫారీఅందాలు తిలకించేందుకు వెళుతుండగాఈ ప్రమాదం చోటుచేసుకుంది. వీరు ప్రయాణిస్తున్న కారు, ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొన్న దుర్ఘటనలో అక్కడికక్కడే ఇద్దరు మరణించగా, మరో ఇరువురు హెలికాప్టర్లో ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకెళుతుండగా మార్గం మధ్యలో మరణించారు.

మృతులలోఎం.వి.వి.ఎస్ మూర్తితో పాటు.. వెలువోలు బసవపున్నయ్య, వీరమాచినేని శివప్రసాద్, వి.బి.ఆర్ చౌదరి (చిన్నా) ఉన్నారు. ఎంవీవీఎస్ మూర్తి ఈ నెల 6వ తేదీన కాలిఫోర్నియాలో జరగనున్నగీతం పూర్వవిద్యార్థి సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొనేందుకు అమెరికా
వెళ్లారు. వీరితో పాటు ఇదే కారులో ప్రయాణిస్తున్న కడియాల వెంకటరత్నం (గాంధీ) తీవ్రగాయాలతో అలాస్కా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ విషయం తెలిసిన తానా అధ్యక్షుడు సతీష్ వేమన, మాజీ అధ్యక్షుడు డాక్టర్ ప్రసాద్ తోటకూర తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేస్తూ వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. అక్కడి అధికారులతో మాట్లాడి వారి పార్థివ దేహాలను భారతదేశం పంపేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

- Advertisement -