ఒక సామాన్యుడి ప్రస్థానం.. శ్రీధర్ బెవర రాసిన.. ’మూమెంట్ ఆఫ్ సిగ్నల్‘

11:40 am, Sat, 15 June 19
sridhar-bevera-moment-of-signal

నాడు ఇంటర్ ఫెయిల్.. నేడు పానసోనిక్ కంపెనీలో జనరల్ మేనేజర్
శ్రీధర్ బెవర రాసిన.. గొప్ప నాయకత్వపు కథగా సంచలనం సృష్టిస్తున్న                                        ఆ పుస్తకం పేరు ’మూమెంట్ ఆఫ్ సిగ్నల్‘                                           ఇది నాయకులకు, నాయకులుగా మారాలి అనుకునే అందరికీ                                     ఇది ఒక దిక్సూచి

ఇక్కడ ముందుగాచెప్పుకోవాల్సిందేమిటంటే..అందరూచరిత్రకెక్కిన గొప్పగొప్ప వాళ్ల పుస్తకాలేచదువుతారు..లేదా మహావ్యక్తులు లేదాపేరు మోసిన రచయితల పుస్తకాలుచదివేందుకు, వినేందుకు ఇష్టపడతారు. కానీ మనచుట్టూ, మన మధ్యలో ఇన్నాళ్లూ ఒక సామాన్యుడిగా తిరిగిన ఒకవ్యక్తి, ఇంటర్మీడియట్ కూడా ఫెయిలైన ఒక వ్యక్తి. తర్వాత ఐఐఎం అహ్మదాబాద్ లాంటి ప్రతిష్ఠాత్మకమైన విద్యాసంస్థలో చదివి ఒక గొప్పస్థాయికి ఎదిగిన శ్రీధర్ బెవర జీవిత కథ ఇది..

ఇలాంటి ఎందరో మనచుట్టూనే ఉన్నారు.. అయితే వారిని పట్టించుకోండి.. వారిలో గొప్పతనాన్ని గుర్తించండి.  అది మీ ఇంట్లోమీ కొడుకు కావచ్చు, మీ కుమార్తె కావచ్చు..లేదా మీ  పక్కింటి అబ్బాయి కావచ్చు.. లేదా చదువుకుంటాను, గ్రూప్స్ రాస్తాను అని చెప్పే మీ భార్య కావచ్చు.. వారిని ఉత్సాహపరచండి.. వారిలో ఉత్తేజాన్ని నింపండి.. పేదరికం సమస్య కానే కాదు.. అని చెప్పే మా అన్నయ్యే నా తొలిగురువు అంటారు శ్రీధర్ బెవర..

తన జీవిత కథను అనుసంధానం చేస్తూ  ఆ స్ఫూర్తిని ఎంతోమందిలో రగిలిస్తూ..అందులోనే అంతర్లీన సందేశాన్నిస్తూ..  శ్రీధర్ బెవర  రాసిన ‘మూమెంట్ఆఫ్ సిగ్నల్’ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా బెస్ట్ సెల్లర్ గానిలిచి… అమ్మకాల్లో  సంచలనం సృష్టిస్తోంది. మన తెలుగువాడైన అతను, ఆ పుస్తకం గురించి  ’న్యూస్ ఎక్సెప్రెస్‘  అందించే ఇన్సిపిరేషన్ స్టోరీ.. మీ కోసం

శ్రీధర్ బెవర

శ్రీధర్ బెవర ది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోవిజయనగరం జిల్లాలోని ’వంతరం’ అనేమారుమూల చిన్న గ్రామం. అయితే బతుకుతెరువు కోసం ఆ కుటుంబం  విశాఖపట్నం చేరుకుంది.  శ్రీధర్ బెవర ఇంటర్మీడియట్ నాలుగుసార్లు ఫెయిల్అయ్యారు.. తర్వాత బీకాం పూర్తి చేశారు. అప్పట్లో ఇంట్లో అందరూ పనిచేస్తేనేగానీ గడవని దుస్థితి..  విశాఖపట్నంలో 18ఏళ్ల వయసులో హెరిటేజ్ పాల ప్యాకెట్ల ఏజెన్సీ తీసుకొని.. వీధి వీధికి తిరిగి విక్రయించేవారు. అలా ఆరు నెలలు పనిచేసి..దానివల్ల ఫలితం లేక.. స్టార్ హోటల్ తాజ్ లో  వెయిటర్ గా, గ్రీన్ పార్క్ హోటల్ లో రెండేళ్లు రెస్టారెంట్ సూపర్ వైజర్ గా పనిచేశారు. మరో రెండేళ్లు  చికెన్ విక్రయ వ్యాపారం చేశారు.

అన్నయ్య నిలబడి..మమ్మల్ని నిలబెట్టాడు..

ఈ క్రమంలో అన్నయ్య మురళి దుబాయ్ వెళ్లి..అక్కడ స్థిరపడి.. మమ్మల్ని కూడా నిలబెట్టేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో తమ్ముడు శ్రీధర్ కి ఒక మాట చెప్పారు.నీలో లీడర్‌షిప్ క్వాలిటీస్ ఉన్నాయి.. మళ్లీ ఆగిపోయిన చదువు పూర్తి చేయ్.. అని ఆయన చెప్పడంతో తిరిగి చదువుని పూర్తిచేసి.. తదనంతరం అహ్మదాబాద్ ఐఐఎంలో ఎంబీఏ సీటు సంపాదించి.. ఉన్నత ఉద్యోగానికి అర్హత సాధించారు శ్రీధర్. అంతకుముందు రెండున్నరేళ్లు ’హిందూ‘లో పనిచేసి.. అప్పుడు దుబాయ్ వెళ్లడంతో ఆయన జీవిత గమనమే మారింది. ఈ రోజున ప్రపంచంలో ఐదు ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీల్లో ఒకటి, వందేళ్ల చరిత్ర కలిగిన పానాసోనిక్ కంపెనీకి జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్నారు.

ఆయన అన్నయ్య చెప్పిన ఒక మాట చెబుతారు..

ముందు నీ చుట్టూ ఉన్న స్నేహితులు, నీ  కుటుంబసభ్యులకి ఎంతవరకు న్యాయం చేయగలుగుతున్నావు.. అన్నది ఆలోచిస్తే.. నీ జీవితంలో గొప్ప మార్పు అదే వస్తుంది.. ఆ భావన వస్తే.. నీవు సమాజానికి ఉపయోగపడతావు.. అప్పుడు సమాజమే నిన్ను గుర్తిస్తుంది..అని.. అదే మాట అక్షరాలా పాటించాను.. ఈరోజున ఈ స్థాయిలో నిలవగలిగాను.అని శ్రీధర్ బెవర చెబుతారు.

దేశంలో టాప్ మోస్ట్ కంపెనీస్‌కి వెళ్లి.. ఉద్యోగులకి పర్సనాలిటీ డెవలప్‌మెంట్ క్లాసులు చెబుతుంటాను.. ఈ క్రమంలోనే నాకు చిన్నప్పటి నుంచి కవిత్వం అంటే చాలా ఇష్టం.. అలా రాసే అలవాటు ఏర్పడింది. అందుకే ఈ పుస్తకం ’మూమెంట్ ఆఫ్ సిగ్నల్స్‘ రాయడం సులువైంది.. అని అంటారు.

వ్యక్తిత్వ వికాసంపై యువతకు సందేశమిస్తూ…

నాయకత్వం ద్వారా వచ్చే ఏ ఫలితాన్నయినా అందరికీ పంచండి..నేనొక్కడినే చేశాను..నాదే ఈ క్రెడిట్ అంతా అని ఎక్కడా అనకండి..అది ఆఫీసులో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు..ఎక్కడైనా సరే…నేనే చేశాను..నేనే..అంతా నేనే.. నా వల్లే ఇదంతా జరిగింది..అని ఎక్కడా అనకండి..

రెండవది.. అందరితో సఖ్యతగా ఉండండి..వారు మాట్లాడకపోయినా..మీరే ఒక మెట్టు దిగి మాట్లాడండి..ఆ సమూహాన్ని వదులుకోకండి. అందులో ఒంటరిగా అయిపోకండి..మీరొక్కరూ చిన్నచిన్న ఈగోస్ తో వచ్చేయకండి..తర్వాత వాళ్లంతా బాగానే ఉంటారు. మిమ్మల్ని పిచ్చోడు అంటారు.. పదిమంది కలిసి ఒక మాటంటే పంతులుగారి చేతిలో మేక..కుక్క కథలా మీ పరిస్థితి అయిపోతుంది..

మూడవది..మీ ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో..అంటే భవిష్యత్తులో మీరేం చేయాలనుకుంటున్నారో..అవి మీ ఒక్కరి వల్లా కాదు..మీకు సపోర్టింగ్ వ్యవస్థ ఒకటి కావాలి. దానిని వదులుకోవద్దు.

నాల్గవది..ఫలితం..ఆశించి ఏదీ చేయవద్దు..అది ఇన్ ఫినెటివ్..అది రావచ్చు..పోవచ్చు..లేదా కొంతే రావచ్చు..లేదంటే అసలు రాకపోవచ్చు.. అయితే మనం చేసే పని ఏదైతే ఉందో..దానిని మాత్రం ఒక బలమైన ఆత్మ విశ్వాసంతో ప్రారంభించండి..ఆ కాంక్ష ఏదైతే ఉందో నిత్యం రగులుతూనే ఉండాలి. ఆ పనిలో అది ఆగకూడదు…

ఇలాంటి ఎన్నో స్ఫూర్తిమంతమైన అంశాలు, తన జీవితంలో ఎదుర్కొన్న ఎన్నో ఒడిదుడుకులు, పేదరికం వాటినన్ని అధిగమించి ఈరోజు ఒక ఉన్నత స్థానంలో ఎలా ఉన్నాడో.. మూమెంట్ ఆఫ్ లైట్స్ చెబుతుంది. ప్రపంచవ్యాప్తంగా అమ్మకాల్లో బెస్ట్ సెల్లర్ గా నిలిచిన ఈ పుస్తకం అందరూ తప్పక చదివి తీరాలి. ఈ కథనం ముగించేముందు అందులో ముఖ్యమైన కొటేషన్ ఏమిటంటే ..

ఒక గొర్రెల మందని నడిపించే సింహానికి భయపడతాను..
కానీ ఒక సింహాల గుంపుని నడిపించే..గొర్రెకు భయపడను..

బహుశా ఇక్కడ ఒక సింహం ఎప్పుడూ రాజులా ఉంటుంది. అది అందరినీ నడిపిస్తుంది. దానికి కోపం వస్తే..ఆ గొర్రెల మందని భయపెడుతుంది..లేదా కొడుతుంది..లేదంటే ఏదైనా చేస్తుంది.. అదే ఒక సింహాల గుంపుని ఒక గొర్రె నడిపిస్తే మాత్రం భయపడాల్సిన పనిలేదు. ఎందుకంటే అన్ని సింహాలు ఒక్కసారి ఎదురుతిరిగితే ఆ గొర్రె ఏమీ చేయలేదు. రాజకీయపార్టీలు మంత్రి పదవులని ఒక అమాయక జీవికి కట్టబెడుతుంటాయి. వాటి వెనుక సింహాలు నడుస్తుంటాయి. అదే సింహం లాంటి వాడు ముందుంటే..ఈ గొర్రెలన్నింటినీ లాగేస్తాడు.. అందుకే నేతలు, నాయకులు ఎవరూ కూడా ఎదిగే నాయకుడిని ఉంచుకోరు. సంస్థల్లో ఎదిగే ఉద్యోగిని తమ వద్ద ఉంచుకోవడానికి ఇష్టపడరు. ఇది బహుశా మేనేజ్ మెంట్ లక్షణాల్లో ఒకటి కావచ్చు. ఈ సారాంశాన్ని ఇలా ఒక కొటేషన్ రూపంలో శ్రీధర్ బెవర చెబుతుంటారు.

గాంధీ మహాత్ముడు సమాజం ఆరోగ్యంగా ఉండాలి.. అని చెప్పేమాటను ఉటంకిస్తూ
మరి మన శ్రీధర్ బెవర ఏమంటారంటే..
‘‘మనిషి ఆరోగ్యంగా ఉంటే.. అతడి భవిష్యత్తు ఆరోగ్యంగా ఉంటుంది.  అందుకని.. నీవు విజయం సాధించాలి అనుకుంటే.. ముందు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టు..’’

– శ్రీనివాస్ మిర్తిపాటి