వావ్.. సూపర్ ఫీచర్స్‌తో గూగుల్ పిక్సల్ కొత్త ఫోన్లు…

9:44 pm, Wed, 8 May 19

ఢిల్లీ: ప్రపంచ సాఫ్ట్‌వేర్ దిగ్గ‌జం గూగుల్ త‌న నూతన పిక్స‌ల్ ఫోన్ల‌యిన పిక్స‌ల్ 3ఎ, పిక్స‌ల్ 3ఎ ఎక్స్ఎల్‌ల‌ను తాజాగా విడుద‌ల చేసింది. ఇవి 5.5, 6 అంగుళాల డిస్‌ప్లేల‌లో ల‌భిస్తున్నాయి.  పిక్స‌ల్ 3ఎ 64జీబీ రూ.39,999 ధ‌ర‌కు ల‌భ్యం కానుండ‌గా, పిక్స‌ల్ 3ఎ ఎక్స్ఎల్ రూ.44,999 ధ‌ర‌కు ల‌భ్యం కానుంది.

ఈ నెల 15వ తేదీ నుంచి ఈ ఫోన్ల‌ను భార‌త్‌లో విక్రయించ‌నున్నారు. ఇక పిక్స‌ల్ 3ఎ, పిక్స‌ల్ 3ఎ ఎక్స్ఎల్ ఫోన్లు జ‌స్ట్ బ్లాక్‌, క్లియ‌ర్లీ వైట్‌, ప్యుపిల్ ఐష్ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో విడుద‌ల‌య్యాయి.

చదవండి: తక్కువ ధరకే జెడ్‌టీఈ కొత్త స్మార్ట్‌ఫోన్.. షియోమీ నుంచి కొత్త గేమింగ్ ఫోన్

గూగుల్ పిక్స‌ల్ 3ఎ, పిక్స‌ల్ 3ఎ ఎక్స్ఎల్ ఫీచ‌ర్లు…

పిక్స‌ల్ 3ఎలో  5.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 1080 x 2220 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌ ఉంటుంది. అలాగే పిక్స‌ల్ 3ఎ ఎక్స్ఎల్ – 6 అంగుళాల డిస్‌ప్లే, 2160×1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌ ఉంటుంది.

రెండు ఫోన్లలో ఉండే మిగతా ఫీచర్లు…

డ్రాగ‌న్‌ట్రెయిల్ గ్లాస్ ప్రొటెక్ష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 670 ప్రాసెస‌ర్‌, 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, 12.2 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి.

అలాగే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, యాక్టివ్ ఎడ్జ్‌, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్ఈ, యూఎస్‌బీ టైప్ సి, ఎన్ఎఫ్‌సీ, 3000 ఎంఏహెచ్ బ్యాట‌రీ (పిక్స‌ల్ 3ఎ), 3700 ఎంఏహెచ్ బ్యాట‌రీ (పిక్స‌ల్ 3ఎ ఎక్స్ఎల్‌), ఫాస్ట్ చార్జింగ్‌ ఫీచర్లు రెండు ఫోన్లలో ఉన్నాయి.

చదవండిఆకర్షణీయమైన ఫీచర్లతో వస్తున్న వివో ఎస్1 ప్రొ…