ఐఫోన్ ఎస్ఈ 2020కి పోటీగా వచ్చేస్తున్న ‘గూగుల్ పిక్సెల్ 4ఎ’

4:39 pm, Fri, 1 May 20

న్యూఢిల్లీ: సెర్చింజన్ దిగ్గజం గూగుల్ నుంచి గతేడాది ‘పిక్సెల్ 3ఎ’ ఊహించని విధంగా మార్కెట్లోకి వచ్చింది.

అయితే, ఈసారి మాత్రం ‘పిక్సెల్ 4ఎ’ మాత్రం చాలా లీకులకు గురైంది. ఈ ఫోన్ ఇప్పటికే చాలాసార్లు లీకులకు పిక్సెల్ 4ఎ లాంచింగ్‌కు సిద్ధమైంది.

తాజాగా లీకైన వివరాల ప్రకారం ఈ పోన్ వచ్చే నెల 22 నుంచి జర్మనీలో విక్రయానికి రానుంది. అయితే, ఇందుకు సంబంధించి కంపెనీ నుంచి మాత్రం ఎటువంటి అధికారిక ప్రకటన లేదు.

‘పిక్సెల్ 4ఎ’ ధర 399 యూరోలు (భారత కరెన్సీలో దాదాపు రూ.32,600) ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

అమెరికాలో దీని ధర 399 డాలర్లు (దాదాపు రూ.30 వేలు) ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్ ఐఫోన్ ఎస్ఈ2020కి గట్టి పోటీ ఇవ్వనుందని సమాచారం.

అలాగే, ధర విషయంలోనూ ఐఫోన్‌కు పోటీ తప్పదని విశ్లేషకులు చెబుతున్నారు.

ఇక, ఫీచర్ల విషయానికి వస్తే స్నాప్‌డ్రాగన్ 730 చిప్‌సెట్, 12 ఎంపీ రిజల్యూషన్‌తో ప్రధాన కెమెరా, 5.81 అంగుళాల ఫుల్‌హెడ్‌డీ ప్లస్ రిజల్యూషన్, 8 ఎంపీ కెమెరా ఉండే అవకాశం ఉంది.