ఇన్ఫినిక్స్ హాట్ 9 సిరీస్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్!

10:23 pm, Sat, 23 May 20

న్యూఢిల్లీ: హాంకాంగ్ మొబైల్ మేకర్ ఇన్ఫినిక్స్ నుంచి హాట్ 9 సిరీస్ ఫోన్లు వచ్చేస్తున్నాయి. ఈ నెల 29న భారత్‌లో విడుదల కానున్నాయి. ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఇవి అందుబాటులోకి రానున్నాయి.

ఈ ఫోన్ల విడుదలకు సంబంధించిన ఇన్ఫినిక్స్ ఈ నెల 20 సోషల్ మీడియాలో టీజ్ చేసింది. ఈరోజు ఈ ఫోన్లకు సంబంధించి ఫ్లిప్‌కార్ట్ మరిన్ని విషయాలు వెల్లడించింది.

ఈ నెల 29న మధ్యాహ్నం 12 గంటలకు ఇన్ఫినిక్స్ హాట్ 9 సిరీస్ ఫోన్లు.. ఇన్ఫినిక్స్ హాట్ 9, ఇన్ఫినిక్స్ హాట్ 9 ప్రొ ఫోన్లు విడుదల కానున్నాయి.

ఈ ఏడాది మార్చిలో ఇండోనేషియాలో విడుదల చేసిన ఫోన్‌కు ఇన్ఫినిక్స్ హాట్ 9 సేమ్ మోడల్ కాగా, 9ప్రొ దీనికి అప్‌గ్రేడెడ్ వెర్షన్.

ఇన్ఫినిక్స్ హాట్ 9 ప్రొ స్పెసిఫికేషన్లు

6.6 అంగుళాల ఐపీఎస్ హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, ఆక్టాకోర్ మీడియా టెక్ హీలియో ఎ25 ప్రాసెసర్, 4జీబీ ర్యామ్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా, వెనకవైపు 48 ఎంసీ ప్రధాన సెన్సార్‌తో క్వాడ్ కెమెరా వంటివి ఉన్నాయి.