స్మార్ట్‌ఫోన్ ధరలను భారీగా పెంచేసిన నోకియా

7:23 pm, Fri, 3 April 20

న్యూఢిల్లీ: దేశంలో నోకియా స్మార్ట్‌ఫోన్ల ధరలు భారీగా పెరిగాయి. భారత ప్రభుత్వం ఇటీవల స్మార్ట‌ఫోన్లపై జీఎస్టీని 12 శాతం నుంచి 18 శాతానికి పెంచిన నేపథ్యంలో నోకియా ఈ నిర్ణయం తీసుకుంది.

నోకియా 2.3, నోకియా 110, నోకియా 6.2, నోకియా 7.2, నోకియా 105, నోకియా 2.2, నోకియా 4.2, నోకియా 3.2, నోకియా 9 వంటి మోడళ్ల ధరలు పెరిగాయి.

నోకియా 2.3 ధర ఇప్పుడు రూ.7,585కు పెరిగింది. నోకియా 110 అసలు ధర రూ.1599 కాగా ఇప్పుడు రూ.1684కు పెరిగింది.

నోకియా 6.2 ధర ఇప్పటి వరకు రూ. 12,499గా ఉండగా ఇప్పుడు రూ. 13,168కి పెరిగింది. నోకియా 7.2 స్మార్ట్‌ఫోన్ 4జీబీ+64జీబీ స్టోరేజీ ధరను ఈ ఏడాది మొదట్లో రూ. 18,599 నుంచి రూ.15,499కి తగ్గించింది. అయితే ఇప్పుడు దీని ధరను రూ.16,330కి పెంచింది.

నోకియా 105, నోకియా 2.2, నోకియా 3.2 ధరలు ఇప్పుడు వరుసగా రూ. 1,053, రూ. 6,320, రూ. 10,008, రూ. 8,428గా ఉన్నాయి.

నోకియా 9ప్యూర్ వ్యూ లాంచింగ్ ధర రూ.49,999గా ఉండగా ఇప్పుడు దీని ధర రూ. 52,677కు పెరిగింది. అంటే రూ.2,678 పెరిగిందన్నమాట.