అదిరిపోయే ఫీచర్లతో నూబియా కొత్త ఫోన్! త్వరలోనే విడుదల…

11:55 am, Wed, 1 May 19

ఢిల్లీ: చైనాకి చెందిన ప్రముఖ మొబైల్స్ తయారీదారు నూబియా… త్వరలోనే భారత్‌లో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ని విడుదల చేయనుంది. రెడ్ మ్యాజిక్3 పేరుతో ఈ ఫోన్ విడుదల కానుంది. ఈ ఫోన్ 6/8/12 జీబీ ర్యామ్ వేరియంట్లలో వినియోగదారులకి లభించనుంది.

6 జీబీ ర్యామ్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ గల ఫోన్ ధర సుమారు రూ. 33,200 వరకు ఉండొచ్చు. అలాగే 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఫోన్ ధర రూ. 36, 300…12 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ధరం రూ. 44,600 వరకు ఉండొచ్చు.

బియా రెడ్ మ్యాజిక్ 3 ఫీచ‌ర్లు…

  • 6.65 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే
  • 2340 × 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌
  • ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 855 ప్రాసెస‌ర్‌, 6/8/12 జీబీ ర్యామ్‌
  • 64/128/256 జీబీ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై
  • డ్యుయ‌ల్ సిమ్‌, 48 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా
  • 16 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌
  • డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై
  • బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి
  • 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌