ఒప్పో నుంచి మరో నయా స్మార్ట్‌ఫోన్.. ఫీచర్స్ అదుర్స్!

8:29 am, Tue, 21 April 20

న్యూఢిల్లీ: చైనీస్ మొబైల్ మేకర్ ఒప్పో ‘ఎ’ సిరీస్‌లో మరో అద్భుతమైన ఫోన్‌ను లాంచ్ చేసింది. దీని పేరు ‘ఒప్పో ఎ52’.

చైనాలో విడుదలైన ఈ ఫోన్‌లో ఒకే ఒక్క ర్యామ్ వేరియంట్ ఉండగా, రెండు కలర్ వేరియంట్లు ఉన్నాయి.

‘ఎ52’లో వెనకవైపు క్వాడ్ కెమెరా ఉపయోగించగా, ముందువైపు సింగిల్ సెల్ఫీ కెమెరా ఉంది.

హోల్‌పంచ్ డిస్‌ప్లే కలిగిన ఈ ఫోన్‌లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఉపయోగించారు.

8 జీబీ ర్యామ్+128 జీబీ వేరియంట్ ధర భారత కరెన్సీలో దాదాపు రూ.17,300.

బ్లాక్, బ్లూ వేరియంట్లు ఉన్నాయి. అంతర్జాతీయంగా ఈ ఫోన్ ఎప్పుడు అందుబాటులోకి వచ్చేదీ కంపెనీ వెల్లడించలేదు.

స్పెసిఫికేషన్లు: ఆండ్రాయిడ్ 10 ఓఎస్, 6.5 అంగుళాల డిస్‌ప్లే, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 665 ఎస్ఓసీ, 8జీబీ ర్యామ్, 12 మెగాపిక్సల్ ప్రధాన కెమెరాతో వెనకవైపు క్వాడ్ కెమెరా, ముందువైపు 8 ఎంపీ కెమెరా, 128 జీబీ ఆన్‌బోర్డ్ మెమొరీ, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి.

Oppo A52 With Quad Rear Cameras 8GB RAM Launched