సూపర్ ఆఫర్: కొత్త ఫోన్లపై ధరలని తగ్గించిన శాంసంగ్, వివో…

12:08 pm, Fri, 3 May 19
SamsungA10-VivoY91

ఢిల్లీ: దక్షిణకొరియాకి చెందిన ఎల‌క్ట్రానిక్స్ త‌యారీదారు శాంసంగ్ త‌న వినియోగదారులకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. ఇటీవల విడుదలై వినియోగదారులని ఆకట్టుకుంటున్న గెలాక్సీ ఎ10, ఎ20, ఎ30 ఫోన్ల ధ‌ర‌ల‌ను భార‌త్‌లో త‌గ్గించింది.

2జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ గల గెలాక్సీ ఎ10 రూ.500 త‌గ్గింపు ధ‌ర‌తో రూ.7,990 ధ‌ర‌కు లభించనుంది. 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ గల గెలాక్సీ ఎ20 రూ.1వేయి త‌గ్గింపు ధ‌ర‌తో రూ.11,490 ధ‌ర‌కు అందిస్తున్నారు.

అలాగే 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ గల గెలాక్సీ ఎ30 రూ.1500 త‌గ్గింపు ధ‌ర‌తో రూ.15,490 ధ‌ర‌కు ల‌భిస్తుంది.

వివో కూడా…

వివో కూడా త‌న వై91, వై91ఐ ఫోన్ల ధ‌ర‌ల‌ను త‌గ్గించింది. వివో వై91 ధ‌ర రూ.9,990 ఉండ‌గా ఇప్పుడిది రూ. 1000 త‌గ్గింది. దీంతో ఈ ఫోన్ ప్ర‌స్తుతం రూ.8,990 కి ల‌భిస్తున్న‌ది.

అలాగే వై91ఐ 32 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.8,490 ధ‌ర ఉండ‌గా, ఇప్పుడు ఫోన్ రూ.7,990 కే ల‌భిస్తున్న‌ది.

చదవండి: అదిరిపోయే ఫీచర్లతో రియల్ మి3 నుంచి కొత్త వేరియంట్ విడుదల….