భారత మార్కెట్లోకి వచ్చేసిన ‘శాంసంగ్ గెలాక్సీ ఎ31’.. ధర, ఫీచర్ల వివరాలు ఇవిగో..

10:09 pm, Thu, 4 June 20

న్యూఢిల్లీ: ‘గెలాక్సీ ఎ30’కి సక్సెసర్‌గా తీసుకొచ్చిన ‘గెలాక్సీ ఎ31’ను శాంసంగ్ భారత్‌లో లాంచ్ చేసింది. వాటర్‌డ్రాప్ స్టైల్ నాచ్, క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ఉన్నాయి.

6జీబీ ర్యామ్, ఆండ్రాయిడ్ 10 ఓఎస్‌తో వచ్చిన ఈ ఫోన్‌లో ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, స్టోరేజీని పెంచుకునే వెసులుబాటు, ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ వంటివి ఉన్నాయి.

గెలాక్సీ ఎ31 6జీబీ ర్యామ్, 128 జీబీ వేరియంట్ ధర రూ. 21,999 మాత్రమే. నేటి నుంచే ఈ ఫోన్ వినియోగదారులకు అందుబాటులో ఉంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, బినౌతోపాటు శాంసంగ్ ఇండియా ఈ-స్టోర్లలోనూ కొనుగోలు చేసుకోవచ్చు. 

శాంసంగ్ గెలాక్సీ ఎ31 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు

* 6.4 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ ఇన్ఫినిటీ-యు డిస్‌ప్లే
* ఆండ్రాయిడ్ 10 ఓఎస్
* ఆక్టాకోర్ మీడియా టెక్ హెలియో పీ65 ఎస్ఓసీ
* 6జీబీ ర్యామ్
* 48 ఎంపీ ప్రధాన సెన్సార్‌తో క్వాడ్ రియర్ కెమెరా సెటప్
* సెల్ఫీల కోసం 20 ఎంపీ కెమెరా
* 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ