జూన్ 2న భారత మార్కెట్లోకి శాంసంగ్ గెలాక్సీ ఎం11, గెలాక్సీ ఎం01

6:48 pm, Sat, 30 May 20

న్యూఢిల్లీ: శాంసంగ్ గెలాక్సీ ఎం11, గెలాక్సీ 01 స్మార్ట్‌ఫోన్లు భారత్‌లో లాంచింగ్‌కు సిద్ధమైపోయాయి. జూన్ 2న ఇవి విడుదల కాబోతున్నట్టు ఫ్లిప్‌కార్ట్ టీజ్ చేసింది.

లాంచింగ్ తర్వాత వెంటనే ఈ ఫోన్లు అందుబాటులోకి వస్తాయని పేర్కొంది. గెలక్సీ ఎం10కు గెలాక్సీ ఎం ఎం11 సక్సెసర్‌గా వస్తుండగా, గెలాక్సీ ఎం 01 మాత్రం ఎంట్రీ లెవల్ ఫోన్. జూన్ 2న మధ్యాహ్నం 12 గంటలకు ఇవి విడుదల కానున్నాయి.

ధరల వివరాలు

గెలాక్సీ ఎం11 3జీబీ ర్యామ్+32 జీబీ స్టోరేజీ మోడల్ ధర రూ. 10,999 ఉండే అవకాశం ఉంది. 4జీబీ ర్యామ్+64 జీబీ ఆప్షన్ ధర రూ. 12,999 ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. గెలాక్సీ ఎం01 3జీబీ ర్యామ్+32జీబీ ర్యామ్ ధర రూ. 8,999గా ఉండే అవకాశం ఉంది.

గెలాక్సీ ఎం11 స్పెసిఫికేషన్లు

6.4 అంగుళాల హెచ్‌డీ+డిస్‌ప్లే, హోల్‌పంచ్ డిజైన్, ఆక్టాకోర్ ఎస్ఓసీ, 13 మెగాపిక్సల్ ప్రైమరీ సెన్సార్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా, 512 జీబీ వరకు మెమొరీని పెంచుకునే అవకాశం, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ.

గెలాక్సీ ఎం01 స్పెసిఫికేషన్లు

13 ఎంపీ ప్రైమరీ సెన్సార్‌తో డ్యూయల్ రియర్ కెమెరా, 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 5.7 అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, వాటర్ డ్రాప్ స్టైల్ నాచ్, ఆక్టాకోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 439 ఎస్ఓసీ, 5 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉన్నాయి.