ఆకర్షణీయమైన ఫీచర్లతో.. భారత్‌కు వస్తున్న ‘వివో ఎస్1 ప్రో’…

2:17 pm, Mon, 6 May 19
Vivo-S1-Pro-in-india

ఢిల్లీ: సెల్ఫీ కెమెరాలకి పెట్టింది పేరైనా వివో సంస్థ ఆకర్షణీయమైన ఫీచర్లతో త్వరలో ఎస్1 ప్రో పేరిట ఓ నూతన స్మార్ట్‌ఫోన్‌ని విడుదల చేయనుంది.  అయితే ఈ ఫోన్ తాజాగా చైనా మార్కెట్లో విడుదలైంది. 6/8 జీబీ రాయ్మ్ వేరియంట్లలో ఈ ఫోన్ లభించనుంది. దీని ప్రారంభ ధర రూ. 27,700గా ఉంది.

చదవండి: సూపర్ ఆఫర్: కొత్త ఫోన్లపై ధరలని తగ్గించిన శాంసంగ్, వివో…

వివో ఎస్‌1 ప్రొ ఫీచ‌ర్లు…

వివో ఎస్1 ప్రో 6.3 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ సూప‌ర్ అమోలెడ్ డిస్‌ప్లేని కలిగి ఉంటుంది.  
2340 × 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూషన్‌
ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 675 ప్రాసెస‌ర్‌
6/8 జీబీ ర్యామ్‌, 256/128 జీబీ స్టోరేజ్‌
256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌,
ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయ‌ల్ సిమ్‌
48, 8, 5 మెగాపిక్స‌ల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు
32 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా
ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌
డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై
బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి
3700 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌

చదవండి:సూపర్ ఆఫర్: కొత్త ఫోన్లపై ధరలని తగ్గించిన శాంసంగ్, వివో…