రెండు దశాబ్దాల బంధానికి తెర.. బ్యాడ్మింటన్‌కు గుడ్‌బై చెప్పేసిన చైనా దిగ్గజ ఆటగాడు లిన్

12:00 pm, Sun, 5 July 20

బీజింగ్: చైనా దిగ్గజ ఆటగాడు లిన్ డాన్ బ్యాడ్మింటన్‌కు విరామం ప్రకటించాడు. రెండు దశాబ్దాలపాటు తన ఆటతీరుతో ప్రేక్షకులను అలరించచిన లిన్.. రిటైర్మెంట్ అవుతున్నట్టు చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. ప్రపంచంలోనే అత్యత్తమ ఆటగాడిగా పేరు సంపాదించుకున్న లిన్ రాకెట్‌తో పెనవేసుకున్న బంధానికి వీడ్కోలు పలుకుతున్నట్టు శనివారం ప్రకటించాడు.

నిజానికి టోక్యో ఒలింపిక్స్ తర్వాత తన నిర్ణయాన్ని ప్రకటించాలని అనుకున్నా.. కరోనా మహమ్మారి కారణంగా ఆ క్రీడలు వాయిదా పడడంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు. 37 ఏళ్లకు దగ్గరపడుతున్న తాను శారీరక సామర్థ్యం, గాయాల కారణంగా సహచర ఆటగాళ్లతో పోటీ పడే అవకాశం లేకపోవడంతో బ్యాడ్మింటన్‌కు బై చెప్పేశాడు.

ఈ సందర్భంగా లిన్ మాట్లాడుతూ.. తనలో స్ఫూర్తి నింపిన తన ప్రత్యర్థులకు ధన్యవాదాలు చెప్పిన లిన్.. ఇకపై మిగిలిన సమయాన్ని తన కుటుంబంతో గడుపుతానని పేర్కొన్నాడు. లిన్ 2008, 2012 ఒలింపిక్స్‌లలో స్వర్ణ పతకాలు కొల్లగొట్టగా, 2006, 2007, 2009, 2011, 2013లలో ప్రపంచ చాంపియన్‌షిప్స్ అందుకున్నాడు. 2004, 2006, 2007, 2009, 2012, 2016లలో ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ విజేతగా నిలిచాడు.