ఓటమితో సీజన్ ప్రారంభించిన ఆరెంజ్ ఆర్మీ!

8:56 am, Mon, 25 March 19
srh vs kkr

హైదరాబాద్: ఐపీఎల్ లో తాజాగా జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ పై కోల్ కతా నైట్ రైడర్స్ 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఓ దశలో గెలుపు సాధ్యమని అందరూ భావించినా సన్ రైజర్స్ ఆశలపై నీళ్లు చల్లాడు ఆండ్రీ రసెల్.

సిక్సులతో చెలరేగిన రసెల్..

రసెల్ కేవలం 19 బంతుల్లో 49 పరుగులు చేసి నైట్ రైడర్స్ విజయంలో ప్రధాన భూమిక పోషించాడు.
ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ 3 వికెట్లకు 181 పరుగులు చేయగా, కోల్ కతా నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

ఓపెనర్ నితీశ్ రాణా 47 బంతుల్లో 68 పరుగులు చేశాడు. రాబిన్ ఊతప్ప 35 పరుగులు నమోదు చేశాడు. ఈ మ్యాచ్ లో రసెల్ ఇన్నింగ్సే హైలైట్ అని చెప్పాలి. 4 ఫోర్లు, 6 సిక్సర్లతో సన్ రైజర్స్ బౌలర్లను బెంబేలెత్తించాడు.