2019 ఐపీఎల్ అవార్డు విన్నర్ల లిస్ట్ ఇదే!

3:55 pm, Mon, 13 May 19
Mumbai

హైదరాబాద్: ఎన్నో భారీ అంచనాలతో మొదలైన ఐపీఎల్ 2019 వినోదాత్మకంగా ఉత్కంఠభరితంగా నిన్నటి మ్యాచ్ తో ముగిసింది. బౌండరీలను శాసించే భారీ హిట్టర్లు, మ్యాచ్‌ను తిప్పేసే బౌలర్లు, ఆకాశాన్ని తాకిని బంతిని ఒడిసి పట్టుకునే క్యాచ్‌లు అభిమానులకు వినోదాన్ని పంచి ముగించాయి.

ఈ సీజన్‌లో అవార్డులు గెలుచుకున్న ప్లేయర్లను ఓ సారి పరిశీలిస్తే..

ఐపీఎల్ 2019 ట్రోఫీ విన్నర్: ముంబై మరోసారి టైటిల్ గెలుచుకుంది. 2013, 2015, 2017, 2019 సీజన్లలో ముంబై టైటిల్ గెలుచుకుని కాలర్ ఎగరేసింది.

ఫైనల్ మ్యాచ్.. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా: జస్పిత్ర బుమ్రా

ఎమర్జెంగ్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ : శుభ్‌మాన్ గిల్
124.30 స్ట్రైక్ రేట్‌తో సీజన్‌ను ముగించిన గిల్.. అవార్డు గెలుచుకుని రూ.10లక్షలు గెలుచుకున్నాడు.

పర్‌ఫెక్ట్ క్యాచ్ ఆఫ్ ద సీజన్ : కీరన్ పొలార్డ్
సీజన్ మొత్తానికి పొలార్డ్ పట్టిన క్యాచ్‌యే పర్‌ఫెక్ట్ క్యాచ్. దీనికి గాను రూ.లక్ష తీసుకువెళ్లనున్నాడు.

స్టైలిష్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ : కేఎల్ రాహుల్
కేఎల్ రాహుల్ స్టైలిష్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ అవార్డును గెలుచుకోగా, ఆ అవార్డును అతని స్నేహితుడైన హార్దిక్ పాండ్యా చేతుల మీదుగా అందుకున్నాడు.

పర్పుల్ క్యాప్ హోల్టర్ : ఇమ్రాన్ తాహిర్
సీజన్ మొత్తంలో 26వికెట్లు పడగొట్టిన తాహిర్ పర్పుల్ క్యాచ్ అవార్డు అందుకున్నాడు. 2012 సీజన్లో హర్భజన్ సింగ్ అందుకోగా, 2013సీజన్లో సునీల్ నరైన్ సొంతం చేసుకున్నాడు.

ఆరెంజ్ క్యాప్ హోల్డర్ : డేవిడ్ వార్నర్

మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ : ఆండ్రీ రస్సెల్
ఆండ్రీ రస్సెల్.. కోల్‌కతా నైట్ రైడర్స్ ప్రధాన ఆయుధంగా మారాడు. ఆ జట్టు ప్లే ఆఫ్ వరకూ రాగలిగిందంటే రస్సెల్ హిట్టింగ్ ఓ బలమైన కారణం. ఈ అవార్డుకు రస్సెల్ రూ.లక్ష రివార్డు అందుకున్నాడు.

సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ద సీజన్ : ఆండ్రీ రస్సెల్
ఆండ్రీ రస్సెల్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డుతో పాటు సూపర్ స్ట్రైకర్ అవార్డును సొంతం చేసుకున్నాడు. దీనికి మరో రూ. లక్ష అందడమే కాక, కారును కూడా బహుకరించారు.

ఫెయిర్ ప్లే అవార్డు : సన్‌రైజర్స్ హైదరాబాద్
2019 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఫెయర్ ప్లే అవార్డు దక్కింది. ఈ అవార్డును వీవీఎస్ లక్ష్మణ్ అందుకుంటారు. ఈ విభాగానికి ఏ రకమైన రివార్డులు లేవు.

పిచ్ అండ్ గ్రౌండ్ అవార్డు : పంజాబ్ క్రికెట్ అసోసియేషన్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్