న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. ఏపీలో రూ.92 కోట్ల మద్యం ఉఫ్!

- Advertisement -

అమరావతి: కొత్త సంవత్సరం వేళ ఆంధ్రప్రదేశ్‌లోని మందుబాబులు కోట్లాది రూపాయల మద్యాన్ని ఉఫ్ మని ఊదేశారు. న్యూ ఇయర్‌ను ఆహ్వానిస్తూ చేసుకున్న సంబరాల్లో మద్యం ఏరులై పారింది. డిసెంబరు 30, 31వ తేదీల్లో భారీ స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగినట్టు ఎక్సైజ్ శాఖ అధికారుల ద్వారా తెలిసింది.

 

ఏపీలో సాధారణంగా సగటున రోజుకు రూ.60 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరుగుతుండగా, డిసెంబరు 30, 31 తేదీల్లో అంతకుమించి అమ్మకాలు జరిగాయి. ఫలితంగా ఈ రెండు రోజుల్లో ఏకంగా రూ.170 కోట్ల విలువైన విక్రయాలు జరిగాయి. వీటిలో బీర్, లిక్కర్ ఉన్నాయి. బుధవారం ఒక్క రోజే 1.65 లక్షల కేసుల లిక్కర్‌, 60 వేల కేసుల బీరు అమ్మకాలు జరిగినట్టు తెలుస్తోంది. దీనిని బట్టి న్యూ ఇయర్‌ను ప్రజలు ఎంత ఘనంగా ఆహ్వానించారో అర్థం చేసుకోవచ్చు.

- Advertisement -