పేదల కోసం పొలం కొని పంటలు పండిస్తా.. కరోనా నుంచి నేర్చుకున్నదిదే: భజ్జీ

10:36 pm, Sat, 13 June 20

జలంధర్: కరోనా కారణంగా తాను ఇతరులకు సహాయపడగలనని తెలుసుకున్నానని టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ వెల్లడించాడు. ఈ మహమ్మారి తనలో మానవత్వాన్ని తట్టిలేపిందని చెప్పాడు.

‘కరోనా మహమ్మారి నాలో మానవత్వాన్ని నిద్రలేపింది. అందుకే కొంత పొలం కొని, పేదల కోసం పంటలు పండించాలని నిర్ణయించుకున్నా. ఇలా మన సమాజంలోని పేదలకు సాయం చేయాలని భావిస్తున్నా’ అని భజ్జీ వెల్లడించాడు.

కేవలం డబ్బు సంపాదించడానికే మనం బతకడం లేదని, ఇతరులకు సాయం చేయడం కూడా మన బాధ్యత అని పేర్కొన్నాడు.