పోలార్డ్ స్టన్నింగ్ క్యాచ్! ముంబై అద్భుత విజయం!

10:43 am, Thu, 4 April 19
Pollard Latest News, IPL Latest News, Mumbai Team News, Newsxpressonline

ఐపీఎల్: వెస్టిండీస్ ఆటగాళ్లకు ఐపీఎల్‌లో ఎంత డిమాండ్ ఉంటుందో మరోసారి రుజువయింది. ఐపీఎల్‌-12 సీజన్‌లో ఇప్పటికే వెస్టిండీస్ స్టార్లు రస్సెల్, గేల్ తమ విన్యాసాలను అభిమానులకు చూపించగా.. తాజాగా కీరన్‌ పొలార్డ్‌ కూడా సత్తా చాటాడు. మొదటగా బ్యాటింగ్ తో చెలరేగగా.. ఆ తర్వాత ఓ అద్భుత క్యాచ్‌తో ఔరా అనిపించాడు.

ముంబై బౌలర్ బెరెన్‌డార్ఫ్‌ వేసిన ఇదో ఓవర్ నాలుగో బంతిని చెన్నై ఆటగాడు సురేష్ రైనా డీప్‌ పాయింట్‌ దిశగా కట్‌ షాట్‌ ఆడాడు. బంతి మెరుపు వేగంతో బౌండరీ వైపు దూసుకెళ్లింది. బంతి వెళ్ళేటప్పుడు కచ్చితంగా సిక్సర్‌ వెళుతుందని చూసేవాళ్ళు అందరూ అనుకున్నారు.

కానీ, బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న పొలార్డ్‌ తన కన్నా చాలా ఎత్తులో వెళ్తున్న బంతిని ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో ఒడిసి పట్టుకున్నాడు. అంతేకాదు ఓ పల్టీ కొట్టినా చక్కగా బాలన్స్ చేసుకుని బౌండరీని తాకకుండా జాగ్రత్తపడ్డాడు. దీంతో క్రీజులో ఉన్న రైనా నిరాశగా పెవిలియన్ చేరుకున్నాడు.

ఈ వీడియోను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తుంది. మీరూ ఓ లుక్కేయండి.

క్యాచ్‌ పట్టుకోకపోయింటే:

171 పరుగుల లక్ష్య ఛేదనలో చెన్నై ఆదిలోనే 2 కీలక వికెట్లు కోల్పోయిన దశలో సురేష్ రైనా తన ప్రతాపాన్ని చూపించాడు. అప్పటికే బౌండరీలు బాది మంచి ఒప్పుమీదున్న రైనా.. పొలార్డ్‌ స్టన్నింగ్ క్యాచ్‌కి బలయ్యాడు. ఒకవేళ పొలార్డ్‌ ఈ క్యాచ్‌ పట్టుకోకపోయింటే ముంబై పరిస్థితి మరోలా ఉండేదేమో. రైనా నిష్క్రమణ అనంతరం చెన్నై ఏ దశలోనూ లక్ష్యం దిశగా వెళ్ళలేదు. చివరకు 37 పరుగుల తేడాతో ఓడిపోయింది.

చదవండి: ధోని కి బ్రేక్ వేసిన రోహిత్ సేన! ముంబై ఇండియన్స్‌ ఘన విజయం!