ఎయిర్‌పోర్టులో నేలపైనే నిద్రపోయిన ధోనీ, సాక్షి! వైరల్ అవుతోన్న ఫోటో..

12:44 pm, Wed, 10 April 19
dhoni

చెన్నై: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ప్రస్తుత వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ సింప్లిసిటీ గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు. తాజాగా, ధోనీ తన భార్యతో కలిసి చెన్నై ఎయిర్ పోర్టులో నేలపైనే నిద్రించగా, ఈ ఫోటో తెగ వైరల్ అవుతోంది. నిన్న రాత్రి కోల్‌ కతా నైట్‌ రైడర్స్‌‌తో.. చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ ఆడిన సంగతి తెలిసిందే.

ఆపై రెండు రోజుల వ్యవధిలోనే అంటే గురువారం జైపూర్‌లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ జట్టుతో చెన్నై సూపర్ కింగ్స్ ఆడాల్సివుంది. ఈ మ్యాచ్ కోసం చెన్నై జట్టు హడావుడిగా ఎయిర్ పోర్టుకు వచ్చింది. విమానం రావడానికి సమయం ఉండటంతో, అప్పటికే విశ్రాంతి లేని ధోనీ నేలపైనే పడుకుని కునుకుతీశారు.

భర్తను ఆనుసరించిన సాక్షి, అతని పక్కనే పడుకుని నిద్రపోయింది. ఆ సమయంలో మిగతా ఆటగాళ్లు కుర్చీల్లో కూర్చుని సేదదీరుతున్నారు. ఇక ఈ ఫోటోను చూసిన ఫ్యాన్స్, ధోనీకి జట్టు ప్రయోజనాలే ముఖ్యమని, ఆయన చాలా సింపుల్ గా ఉంటారని మరోసారి ప్రూవ్ అయిందని కామెంట్లు పెడుతున్నారు.