దంచికొట్టిన ధోనీ….ఢిల్లీపై చెన్నై ఘనవిజయం….

7:58 am, Thu, 2 May 19
chennai win against delhi

చెన్నై: ఈ ఐపీఎల్ సీజన్ ఆరంభం నుంచి అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడుతూ..చెన్నైకి అద్భుత విజయాలని అందిస్తున్న కెప్టెన్ ధోనీ…మరోసారి ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఫలితంగా బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 80 పరుగుల తేడాతో విజయం సాధించింది.

తొలుత టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ చెన్నైని బ్యాటింగ్‌కి ఆహ్వానించాడు. దీంతో బ్యాటింగ్‌కి దిగిన చెన్నైకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఫామ్‌లో లేని ఓపెనర్ వాట్సన్ డకౌట్‌ అయ్యాడు. ఇక మరో ఓపెనర్ డుప్లెసిస్‌తో రైనా జత కలిసి ఇన్నింగ్స్‌ని స్లోగా నిలబెట్టడం చేశారు. హార్డ్ హిట్టర్‌లు అయిన వీరిద్దరూ…వేగంగా పరుగులు చేయడానికి నానా ఇబ్బందులు పడ్డారు. ఇన్నింగ్స్ 13వ ఓవర్లో డుప్లెసిస్ తొలి సిక్స్ కొట్టాడంటే ఢిల్లీ..ఎలా బౌలింగ్ చేసిందో ఇట్టే అర్థమవుతుంది.

చదవండికోహ్లీ కెప్టెన్సీపై ఘాటు వ్యాఖ్యలు చేసిన గంభీర్….

ఈ క్రమంలోనే స్కోరు బోర్డు 87 వద్ద డుప్లెసిస్ 39 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత రైనా 59 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన ధోనీ, జడేజా స్కోరు బోర్డుని పరుగులేత్తించారు. ధోనీ 22 బంతుల్లో 44 నాటౌట్, జడేజా 10 బంతుల్లో 25 పరుగులు చేయడంతో చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 179/4 పరుగులు చేసింది.

ఢిల్లీని దెబ్బ కొట్టింద జడేజా, తాహిర్

180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టుని జడేజా, తాహిర్‌లు చావు దెబ్బ కొట్టారు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్(44) తప్ప…మిగతా బ్యాట్స్‌మెన్లు సింగిల్ స్కోరుకే పరిమితం కావడంతో 16.2 ఓవర్లలో 99 పరుగులకి ఆలౌట్ అయి చేతులెత్తేసింది. తాహిర్ 4 వికెట్లు, జడేజా 3 వికెట్లు తీసి చెన్నైకి అదిరిపోయే విజయాన్ని కట్టబెట్టారు. ఇక చెన్నై విజయంలో కీలకపాత్ర పోషించిన ధోనీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.  ఈ విజయంతో చెన్నై మొత్తం 18 పాయింట్లతో టేబుల్‌లో నెంబర్ స్థానానికి వెళ్లింది.