భారత ఫీల్డింగ్‌లో కైఫ్ ఓ ట్రెండ్ సెట్టర్ : వీవీఎస్ లక్ష్మణ్

- Advertisement -

‘గ్రౌండ్‌లో కైఫ్ మెరుపు వేగంతో కదులుతూ ప్రత్యర్థికి కైఫ్ చుక్కలు చూపించేవాడు.

ఒక్క మాటలో చెప్పాలంటే భారత ఫీల్డింగ్‌లో కైఫ్ ఓ ట్రెండ్ సెట్టర్’ అని మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ సహచరుడు మహ్మద్ కైఫ్‌ను ఆకాశానికెత్తేశాడు.

- Advertisement -

భారత క్రికెట్‌లో ఫీల్డింగ్‌‌కు కొత్త అర్థం చెప్పిన ఆటగాడు మహ్మద్ కైఫ్ అని, అతడి  అడుగుజాడల్లో ఇప్పుడు ఎందరో ఆటగాళ్లు నడుస్తున్నారని పేర్కొన్నాడు.

ఎందరో యువ ఆటగాళ్లకు అతడు ఆదర్శంగా నిలుస్తున్నాడని చెప్పుకొచ్చాడు.

ముందుకు డైవ్ చేస్తూ ఓ అసాధారణమైన క్యాచ్ అందుకుంటున్న కైఫ్ ఫోటోను ఇటీవల తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసిన లక్ష్మణ్ ఈ విధంగా రాసుకొచ్చాడు.

‘క్రికెట్‌లో ఓ తరాన్ని ప్రభావితం చేసిన ఆటగాడు మహ్మద్ కైఫ్. ఆటగాళ్లు తమ మనసులోని భయాలను పక్కనపెట్టి స్వేచ్ఛగా ఆడేందుకు, తమ అత్యున్నత ప్రతిభను బయటపెట్టేందుకు కైఫ్ ఓ మార్గాన్ని చూపాడు.

ఇప్పటికీ యూపీలోని ఎందరో యువ ఆటగాళ్లకు కైఫ్ ఓ రోల్ మోడల్‌గా నిలుస్తున్నాడు’ అంటూ లక్ష్మణ్ కైఫ్‌ను ఆకాశానికెత్తేశాడు.

- Advertisement -