వికెట్ కీపర్ అంటే ఎలా ఉండాలో వాళ్లు నిరూపించారు: సంజూ శాంసన్

- Advertisement -

కీపింగ్ అంటే వికెట్ల వెనక బంతిని పట్టుకోవడమే కాదు జట్టు కష్టకాలంలో ఉన్నప్పుడు బ్యాట్‌కు పని చెప్పగలిగి ఉండాలి. 

ఈ విషయాన్ని అక్షరాలా నిరూపించిన ఆటగాళ్లు ఆస్ట్రేలియా కీపర్ ఆడం గిల్‌క్రిస్ట్, భారత కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ. 

- Advertisement -

దీనిపై కేరళ యువ ఆటగాడు, వికెట్ కీపర్ సంజూ శాంసన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 

ధోనీ, గిల్‌క్రిస్ట్‌లు కీపర్ల స్థాయిని తారస్థాయికి తీసుకెళ్లారని సంజూ అభిప్రాయపడ్డాడు.

ప్రస్తుతం వికెట్ కీపర్ అంటే కేవలం కీపింగ్ మాత్రమే కాకుండా ఓ స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ కూడా అయి ఉండాలని వీరిద్దరూ నిరూపించారని చెప్పాడు.

‘గిల్‌క్రిస్ట్ ఓపెనింగ్‌ బ్యాట్స్‌మెన్‌గా వచ్చి జట్టును ముందుండి నడిపించేవాడు. ఇక ధోనీ విషయానికి వస్తే మిడిల్‌ ఆర్డర్‌, లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చి జట్టు బాధ్యతను మొత్తం భుజాల మీద వేసుకుని మోసేవాడు.

దీనివల్ల జట్టులో అదనపు బౌలర్‌ను చేర్చుకునే వీలు కలుగుతుంద’ని శాంసన్ చెప్పుకొచ్చాడు.

అయితే దీనివల్ల ప్రస్తుతం జట్టులోకి ఎవరైనా వికెట్ కీపర్ రావాలనుకుంటే అతడు మంచి బ్యాట్స్‌మెన్ కూడా అయి ఉండాల్సిన అవసరం ఏర్పడిందన్నాడు.

అందుకే తాను వారిద్దరినీ ఎంతో గౌరవిస్తానని చెప్పాడు. ముఖ్యంగా ధోనీ నుంచి ఎంతో నేర్చుకున్నానని, ఇంకా ఎంతో నేర్చుకోవాలని శాంసన్ పేర్కొన్నాడు.

ఇదిలా ఉంటే ప్రస్తుత కరోనా కాలంలో క్రికెట్‌లో రాబోతున్న మార్పులపై కూడా సంజూ స్పందించాడు.

బంతిని ఉమ్మితో శుభ్రం చేసే నియమంతో తనకు సంబంధం లేదని, తాను వికెట్ల వెనక గ్లౌజులు ధరించి ఉంటానని, తనకు ఆ నిబంధనతో పనిలేదని చెప్పాడు. అయితే ఈ నిబంధన ప్రస్తుతం క్రికెట్ అవసరమేనని చెప్పాడు.

- Advertisement -