హ్యాట్రిక్‌‌ విజయాలు సాధించిన హైదరాబాద్! ఢిల్లీ ఘోర పరాజయం!

11:18 am, Fri, 5 April 19
Hyderabad Match News, Dehli Match News, IPL Latest News, Nrewsxpressonline

ఢిల్లీ: ఐపీఎల్ 2019 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు హ్యాట్రిక్ విజయాల్ని అందుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఫిరోజ్ షా కోట్ల వేదికగా గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్, బ్యాటింగ్‌లో రాణించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 5 వికెట్ల తేడాతో అలవోక విజయాన్ని అందుకుంది.

తొలుత భువనేశ్వర్ (2/27), మహ్మద్ నబీ (2/21), సిద్ధార్థ కౌల్ (2/35) రాణించడంతో ఢిల్లీ క్యాపిటల్స్‌ని 129/8కే పరిమితం చేసిన హైదరాబాద్.. ఆ తర్వాత ఓపెనర్ బెయిర్ స్టో (48: 28 బంతుల్లో 9×4, 1×6) రాణించడంతో మరో 9 బంతులు మిగిలి ఉండగానే 131/5తో విజయాన్ని అందుకుంది.

తొలి మ్యాచ్‌లో కోల్‌కతా చేతిలో ఓడిన హైదరాబాద్ ఆ తర్వాత వరుసగా రాజస్థాన్, బెంగళూరు, ఢిల్లీ జట్లని ఓడించి హ్యాట్రిక్ విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. మరోవైపు ఢిల్లీకి ఇది వరుసగా రెండో ఓటమి. ఛేదనలో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ బెయిర్‌స్టోకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

చదవండి:  మరో ఆసక్తికర పోరు రంగం సిద్ధం! గెలిచేదెవరు?