సచిన్ అంటే తనకు ఎంతో గౌరవం అని, తాను క్లిష్ట పరిస్థితులలో ఉన్నప్పుడు సచిన్ తనకు ఎంతో అండగా ఉన్నాడు అని యువరాజ్ ఇటీవల ఓ ట్వీట్ ద్వారా చెప్పాడు.
భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్‌కు సచిన్ టెండూల్కర్ అంటే ఎంత ఇష్టమో తెలిసిందే. అవకాశం వచ్చినప్పుడల్లా ఆ ఇష్టాన్ని యువరాజ్ తెలియజేస్తూనే ఉంటాడు.
యువరాజ్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి సంవత్సరమైన నేపథ్యంలో యువరాజ్‌కు సచిన్ ఒక ట్వీట్ చేశాడు.
‘యువరాజ్.. నిన్ను మొదటిసారిగా చెన్నై క్యాంపులో చూశాను. అప్పుడే నీ ఆటతీరు, చురుకుదనం నేను గుర్తించాను.
ఇక నువ్వు సిక్సులు వేరుగా చెప్పక్కర్లేదు. ప్రపంచంలో ఉన్న ఏ గ్రౌండ్లో అయిన నువ్వు అద్బుతంగా ఆడగలవు.
నువ్వు క్రికెట్‌కు వీడ్కోలు పలికి నేటికి ఏడాది గడిచింది’ అంటూ ఆ ట్వీట్లో పేర్కొన్నాడు. దీనిపై స్పందంచిన యువరాజ్ సచిన్‌కు కృతజ్ఞతలు చెప్పాడు.
‘మిమ్మల్ని మొదటిసారి కలిసినప్పుడు ఎంతో ఎగ్జైట్ అయ్యా. మీకు మొదటిసారి షేక్ హ్యాండ్ ఇచ్చిన్నప్పుడు దేవుడితో చేయి కలిపినట్టు అనిపించింది.
నేను క్రికెట్లో కష్టపడుతున్నప్పుడు మీరు నాకు అండగా నిలిచారు. మీ స్పూర్తితోనే తరువాతి తరానికి మార్గదర్శనం చేస్తాను’ అంటూ సచిన్ ట్వీట్‌పై యువరాజ్ సింగ్ స్పందించాడు.
ఈ ట్వీట్లపై ఇద్దరు క్రికెటర్ల అభిమానులు కూడా ప్రశంశల జల్లు కురిపిస్తున్నారు. యువరాజ్ తరపున కూడా కొందరు నెటిజన్లు సచిన్‌ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
మరోవైపు యువరాజ్ రిప్లైపై కూడా అభిమానులు ఫిదా అవుతున్నారు. ‘నువ్వు అనుకున్నది సాధిస్తావు యువీ’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.