ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్…హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన టికెట్లు….

1:35 pm, Mon, 6 May 19
India-Pakistan World Cup Match Tickets Sold Out Within 48 Hours

 

ఢిల్లీ: ఇండియా-పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ అంటే,…. క్రికెట్ అభిమానులకి పండుగే అని చెప్పాలి. ఈ రెండు దేశాల మధ్య మ్యాచ్ అంటే… కేవలం ఇండియా-పాకిస్థాన్ అభిమానులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రికెట్ అభిమానులంతా ఆసక్తిని చూపుతారు.

అయితే రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బ తినడంతో గత కొన్నేళ్ళ నుంచి భారత్  పాకిస్థాన్ జట్ల మధ్య ఎటువంటి మ్యాచ్‌లు జరగడం లేదు. కానీ ఐసీసీ నిర్వహించే టోర్నీలలో అప్పుడప్పుడు ఈ ఇరుజట్లు తలపడ్డాయి.

చదవండి:ముంబై చేతిలో చిత్తుగా ఓడిన కోల్‌కతా….ప్లే ఆఫ్స్‌కు చేరుకున్న హైదరాబాద్….

ఈ క్రమంలోనే మరికొద్ది రోజుల్లో జరగబోయే వరల్డ్ కప్‌లో దాయాది దేశాల మరోసారి తలపడనున్నాయి.  జూన్ 16న మాంచెస్టర్ లో ఇండో-పాక్ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్ల అమ్మకాలని తాజాగా మొదలు పెట్టారు.

ఇక టికెట్ల అమ్మకం మొదలు పెట్టిన 48 గంటల్లోనే అన్నీ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఈ విషయాన్ని టోర్నీ నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు. ఏది ఏమైనా ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్‌కి ఉన్న క్రేజ్ వేరే అనే చెప్పాలి.

చదవండి:మహర్షి సినిమాలోని కీలక అంశాలు ఇవే!