ఇండియాను అలా అడుక్కోవడమా? నో ఛాన్స్!: పాక్ క్రికెట్ బోర్డు చీఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు…

3:28 pm, Fri, 14 June 19
Pakistan Latest News, Cricket Latest News, India Latest Updates News, Newsxpressonline

ప్రపంచ కప్‌లో భాగంగా ఆదివారం భారత్ – పాకిస్థాన్ మధ్య జరగనున్న మ్యాచ్‌పై సర్వత్రా చర్చ జరుగుతోంది. దాయాదుల పోరు ఎలా ఉంటుందనే విషయం ఆసక్తికరంగా మారగా… ప్రపంచం మొత్తం ఈ మ్యాచ్ కోసం ఎదురుచూస్తోంది.

చదవండి: అదరహో ప్రభాస్… సాహో టీజర్ పై జక్కన్న కాంప్లిమెంట్స్

చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్తాన్ జట్టుతో టీమిండియా సమరానికి సన్నద్ధం అవుతుండగా.. పాక్ క్రికెట్ బోర్డు చీఫ్ ఎహ్సాన్ మణి వ్యాఖ్యలు ఆహ్వానించే విధంగా లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

పాకిస్తాన్‌తో క్రికెట్ ఆడాలని… తాము భారత్‌ను ఎన్నడూ అడుక్కోలేదని… అసలు ఆ అవసరమే లేదంటూ ఎహ్సాన్ మణి వ్యాఖ్యానించారు. అంతేకాదు, ఇండియానే కాదు.. ఏ దేశాన్ని మాతో మ్యాచ్‌లు ఆడండి అని తాము ఎప్పుడూ అడగలేదన్నారు.

క్రికెట్ విషయంలో ఇండియాతో సత్ సంబంధాలను పెంచుకునేందుకు పాకిస్థాన్ ప్రయత్నిస్తుందన్నారు. ఇండియాలో ఈ ఏడాది జరగనున్న ఐసీసీ మహిళా వరల్డ్ చాంపియన్ షిప్ లో పాక్ జట్టు పాల్గొంటుందని తెలిపారు.

కాగా .. 2013 నుంచి భారత్, పాకిస్థాన్ లు ఒక్క సిరీస్ కూడా ఆడలేదు. కానీ.. పలు టోర్నీల్లో పోటీ పడ్డాయ్. ఇక ప్రపంచకప్ లో ఆదివారం జరగనున్న మ్యాచ్ లో ఎలాగైనా నెగ్గాలనే కసితో పోటీకి దిగుతున్నాయ్ ఇరు జట్లు.