భారత్-దక్షిణాఫ్రికా మధ్య రెండో టెస్టు.. కెప్టెన్‌గా కోహ్లీకి ప్రత్యేకం

1:56 pm, Wed, 9 October 19

పుణె: భారత్-దక్షిణాఫ్రికా మధ్య రేపటి నుంచి రెండో టెస్టు ప్రారంభం కానుంది. పుణె వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ టీమిండియా సారథి విరాట్ కోహ్లీకి ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే కెప్టెన్‌‌గా కోహ్లీకి ఇది 50 టెస్టు మ్యాచ్. సారథిగా జట్టును విజయపథంలో నడిపిస్తున్న కోహ్లీ ఈ మ్యాచ్‌ను కూడా గెలిపించి అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకోవాలని పట్టుదలగా ఉన్నాడు.

అందని ద్రాక్షగా పుణె

కోహ్లీ సారథ్యంలో స్వదేశంలో జరిగిన అన్ని మ్యాచుల్లోనూ భారత్ విజయం సాధించిన పుణెలో విజయం మాత్రం అందని ద్రాక్షగా ఉంది. దీంతో రేపటి నుంచి పుణెలో జరగనున్న టెస్టును గెలవడం ద్వారా ఆ లోటును భర్తీ చేయాలని కోహ్లీ భావిస్తున్నాడు.

2017లో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య పుణెలో జరిగిన టెస్టులో అప్పటి కెప్టెన్ స్టీవ్ స్మిత్ సెంచరీతో చెలరేగడంతో ఆసీస్ 333 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మళ్లీ ఇన్నాళ్లకు ఇదే వేదికపై సఫారీలతో మ్యాచ్ జరగనుంది.

టెస్టు చాంపియన్‌షిప్‌లో అగ్రస్థానం

మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో తొలి టెస్టును గెలిచిన భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. పుణె టెస్టులో ఓడిన సఫారీలు ఈ మ్యాచ్‌లో విజయం సాధించి టెస్టు సిరీస్‌ను సమం చేయాలని గట్టి పట్టదలగా ఉన్నారు. కాగా, విశాఖ టెస్టులో విజయం సాధించిన భారత్ ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్‌లో 160 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది.