రెండో టెస్ట్: ముగిసిన తొలిరోజు ఆట… వెస్టిండీస్ 295/7.. సెంచరీకి చేరువలో చేజ్…

ind-vs-wi
- Advertisement -

ind-vs-wi

హైదరాబాద్: భారత్ – వెస్టిండీస్ మధ్య ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్నరెండో టెస్టులో తొలిరోజు ఆట ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ ఆట ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది.

- Advertisement -

రోస్టన్ చేజ్ 98(174 బంతులలో) దేవేంద్ర బిషూ 2 (15 బంతులలో) లతో క్రీజులో ఉన్నారు.  వెస్టిండీస్‌  113 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినట్టు కనిపించినా తర్వాత కుదురుకుంది. తొలి టెస్టులో చేసిన పొరపాట్లను మళ్ళీ చేయ్యకుండా జాగ్రత్త పడింది. కుల్డీప్ యాదవ్, ఉమేశ్ యాదవ్‌లను సమర్ధంగా ఎదుర్కొంటూ వికెట్లు పడకుండా వెస్టిండీస్ ఆటగాళ్లు జాగ్రత్తగా ఆడారు.

రోస్టన్ చేజ్ 98 (174 బంతులలో) , కెప్టెన్ జాసన్ హోల్డర్ 52 (92 బంతులలో) పరుగులతో జాగ్రత్తగా ఆడుతూ స్కోరును 250 దాటించారు. దీంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్ 7 వికెట్లుకు 295 పరుగులు చేసింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3, ఉమేశ్ యాదవ్ 3 వికెట్లు,  వికెట్లు తీసుకోగా, అశ్విన్ ఓ వికెట్ పడగొట్టాడు.

Shardul Thakurపాపం శార్థుల్ అదృష్టంలోనే దురదృష్టం…

భారత్ యువ బౌలర్ శార్థుల్ ఠాకుర్‌కు రాకరాక అవకాశం వస్తే అంతలోనే దురదృష్టం అతడ్ని వెంటాడింది. వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌తో అంతర్జాతీయ టెస్ట్‌లోకి శార్థుల్ అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. తన తొలి టెస్ట్‌లో ఉత్సాహంగా బంతి అందుకున్న శార్థుల్ 10 బంతులు వేశాడో లేదో.. అంతలో అతని చీలమండ గాయం తిరగబెట్టింది. ఈ నొప్పితో శార్థుల్ బాధపడడంతో… చివరికి కెప్టెన్ కోహ్లి, ఫిజియోథెరపిస్ట్ సూచనల మేరకు అతడు మైదానం వీడాడు. దీంతో స్టేడియం ఆటగాళ్లు, ప్రేక్షకులు పాపం శార్థుల్ అంటూ సానుభూతి వ్యక్తం చేశారు.

 

- Advertisement -