రేపే వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ ప్రారంభం… ఇదే భారత్ జట్టు

Indian team1
- Advertisement -

Indian team1

గౌహతి: వెస్టిండీస్‌తో గౌహతి వేదికగా ఆదివారం మధ్యాహ్నం నుంచి జరగనున్న తొలి వన్డే మ్యాచ్ కోసం 12 మందితో కూడిన భారత జట్టుని శనివారం బీసీసీఐ ప్రకటించింది. ఇటీవల ముగిసిన రెండు టెస్టుల సిరీస్‌లో 92, 92 పరుగులతో మెరిసిన రిషబ్ పంత్‌ ఈ జట్టులో చోటు దక్కించుకున్నాడు. అయితే.. రెగ్యులర్ వికెట్ కీపర్ ధోనీ కూడా జట్టులోనే ఉండటంతో.. కేవలం బ్యాట్స్‌మెన్‌గా మాత్రమే అతడిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. జట్టు ఎంపిక తీరు చూస్తుంటే.. రేపు రిషబ్ పంత్ వన్డే అరంగేట్రానికి మార్గం సుగమమైనట్లేనని తెలుస్తోంది.

- Advertisement -

ఓపెనర్లుగా శిఖర్ ధావన్, రోహిత్ శర్మ తమ స్థానాల్ని నిలబెట్టుకోగా.. మిడిలార్డర్‌లో విరాట్ కోహ్లి, అంబటి రాయుడు, రిషబ్ పంత్, మహేంద్రసింగ్ ధోని, రవీంద్ర జడేజా‌కి అవకాశం దక్కింది. ఇక బౌలింగ్ విభాగంలో జడేజాతో పాటు స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, చాహల్‌ చోటు దక్కించుకోగా.. ఫాస్ట్ బౌలర్ల కోటాలో ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీ, ఖలీల్ అహ్మద్ ఎంపికయ్యారు.‌

బలహీనమైన వెస్టిండీస్ జట్టుపై బలమైన ఇండియన్ టీమ్ ఉండటంపై సీనియర్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఎందుకంటే ఇలాంటప్పుడైనా కొత్తవారికి అవకాశమిస్తే వారు సీరియస్ గా ప్రయత్నిస్తారు. ఎప్పుడో సిరీస్ గెలిచాక.. ఒక ఇద్దరికి అవకాశం ఇచ్చి.. వారిని ఆడమంటే.. ఆ ఒక్క అవకాశం వారు నిరూపించుకోకపోతే మళ్లీ తెరమరుగైపోతున్నారు. మళ్లీ ఇంకో సిరీస్ వరకు వారు ఎదురుచూడాల్సిందే. ఇప్పుడు ఆడుతున్న అద్భుతంగా ఆడుతున్న వారిలో రోహిత్ శర్మకు ఎన్ని అవకాశాలిచ్చారు.. అలా ఇప్పుడు కొత్తవారికి ఇస్తున్నారా.. అనేది బోర్డు ఆలోచించాలి.

 

- Advertisement -