దేవుడా…సార్వత్రిక ఎన్నికలకు ఇంత ఖర్చు అయిందా..?

- Advertisement -

ఢిల్లీ: భారతదేశంలో ఎన్నికలు చాలా ఖరీదు అని మరోసారి రుజువైంది. ఇటీవల ఏడు దశల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భారీగా ఖర్చు అయిందని ఢిల్లీకి చెందిన సెంటర్‌ ఫర్‌ మీడియా స్టడీస్‌ (సీఎంఎస్‌) సంస్థ తెలిపింది.

ఈ సంస్థ వేసిన అంచనా ప్రకారం.. ఈమధ్య ముగిసిన లోక్‌సభ ఎన్నికల ఖర్చు దాదాపు రూ 60వేల కోట్లు (8.7బిలియన్‌ డాలర్లు) ఉందని వెల్లడించింది. ఈ ఖర్చు 2014 సార్వత్రిక ఎన్నికల కంటే రెట్టింపు అని తెలిపింది.

ఇక ఈ 60వేల కోట్లలో 15-20 శాతం ఎన్నికల సంఘం చేసిన వ్యయమే అట. అలాగే  ఒక్కో నియోజకవర్గంలో సాగతున రూ 100 కోట్ల మేర ఖర్చు జరిగిందని, సగటున ఒక్కో ఓటరుపై పెట్టిన ఖర్చు రూ 700 పెట్టినట్లు తెలిపింది.

ఎన్నికల నిర్వహణ, పార్టీలు ప్రచారం నిమిత్తం చేసిన వ్యయం, ఇతరత్రా ప్రలోభాలూ… వీటన్నింటినీ లెక్కవేస్తే రూ. 60 వేల కోట్లు తేలిందని  సీఎంఎస్‌ ఓ నివేదికలో తెలిపింది.

చదవండి ఎస్పీతో పొత్తు తెగదెంపులు చేసుకున్న బీఎస్పీ
- Advertisement -