ప్లేఆఫ్ చేరిన చెన్నైసూపర్‌ కింగ్స్‌! కీలక దశలో ఫామ్‌‌లోకి వచ్చిన షేన్‌ వాట్సన్‌!

11:04 am, Wed, 24 April 19
WATSONVIVEKBENDRE

చెన్నై: చెన్నై సూపర్‌ కింగ్స్‌ తప్ప వేరే జట్టులో ఉండి ఉంటే తనను ఎప్పుడో డ్రెస్సింగ్‌ రూమ్‌కి పరిమితం చేసేవారని షేన్‌ వాట్సన్‌ అన్నాడు. మంగళవారం సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెలరేగిన వాట్సన్‌ 96(53బంతుల్లో 9ఫోర్లు, 6 సిక్సర్లు) పరుగులు చేశాడు. చెన్నై విజయంలో కీలక పాత్ర పోషించాడు.

అయితే, వరుస మ్యాచుల్లో విఫలమైనా తనకు చెన్నై అవకాశాలు ఇచ్చిందని, వేరే జట్టులో ఉండి ఉంటే ఇన్ని అవకాశాలు వచ్చేవి కావని వాట్సన్‌ పేర్కొన్నాడు. ‘చెన్నై కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌, కెప్టెన్‌ ధోని నామీద ఎంతో నమ్మకం ఉంచారు. నేను జట్టుకు ఇంకా ఎన్నో పరుగులు బాకీ ఉన్నాను. గతంలో బీబీఎల్‌, పీఎస్‌లోనూ రాణించాను.

కానీ, ఐపీఎల్‌ సీజన్‌ ప్రారంభం నుంచి అంచనాలు అందుకోలేకపోయాను. అయితే, జట్టు నామీద నమ్మకం ఉంచింనందుకు ఆ జట్టుకు రుణపడి ఉంటాను’ అని వాట్సన్‌ పేర్కొన్నాడు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ 173 పరుగులు చేసింది. ఛేదన ప్రారంభంలోనే డూప్లెసిస్‌ వికెట్ కోల్పోవడంతో కష్టాల్లో పడ్డ చెన్నైని రైనా, రాయుడుతో కలిసి మంచి భాగస్వామ్యాలు నిర్మించారు.

వాట్సన్‌ తన అద్భుత ఇన్నింగ్స్‌తో విజయానికి మార్గం సుగమం చేశాడు. ఈ సీజన్‌లో మొదటిసారి మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు. గత ఐపీఎల్‌లో ఫైనల్‌ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై ఈ చెన్నై బ్యాట్స్‌మన్‌ శతకం బాది చెన్నైకి కప్పు తెచ్చి పెట్టిన విషయం తెలిసిందే.