ఇస్లామాబాద్: టీ20 ప్రపంచకప్‌లో భారతజట్టుకు వికెట్‌కీపర్‌గా బెస్ట్ ఆప్షన్ మహేంద్రసింగ్ ధోనీనే అని పాక్ వికెట్‌కీపింగ్ బ్యాట్స్‌మెన్ కమ్రాన్ అక్మల్ స్పష్టంచేశాడు.
ట్విట్టర్లో వేదికగా ఓ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్లో కమ్రాన్ ఈ విధంగా బదులిచ్చాడు. ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్‌కప్‌లో భారత వికెట్ కీపర్‌గా ఎవరుండాలని ప్రశ్నించగా.. ‘ఇంకెవరు ధోనీనే’ అని కమ్రాన్ బదులిచ్చాడు.
సెకండ్ ఆప్షన్‌గా కేఎల్ రాహుల్‌ను ఎంచుకుంటానని చెప్పాడు. అలాగే తన ఫేవరెట్ క్రికెటర్లుగా అబ్దుల్ రజాక్, జాక్వెస్ కలిస్లు పేర్లు వెల్లడించాడు.