అలా చెప్పలేదన్న జడేజా.. అంతా అయిపోయాక డౌట్లు వస్తాయన్న కోహ్లీ

- Advertisement -

న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాల మధ్య ట్విటర్‌లో ఈ మధ్య ఓ సరదా సంభాషణ చోటుచేసుకుంది. 

ఇది వారి అభిమానులకు మంచి హాస్యాన్ని పంచింది. వివరాల్లోకి వెళితే..

- Advertisement -

భారత క్రికెట్ టీమ్‌లో చురుకైన ఆల్‌రౌండర్ ఆటగాడు రవీంద్ర జడేజ. అతడికి సరైన పోటీ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ.

అయితే లాక్‌డౌన్ కారణంగా వీరిద్దరు ఇళ్లకే పరితమయ్యారు. ఈ సందర్బంగా తను ఆడిన ఓ టెస్ట్ మ్యాచ్‌కు సంబంధించిన ఓ ఫొటోను జడేజ సోషల్‌మీడియాలో షేర్ చేశాడు.

దానికి ‘రివ్యూ తీసుకోమని నేను చెప్పలేదంటూ జడేజ ఫొటోకు క్యప్షన్ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ఈ ట్వీట్‌పై కోహ్లీ స్పందించాడు.

‘నీకు రివ్యూ తీసుకోనంత వరకు ఔట్ అనిపిస్తుంది, రివ్యూ తీసుకున్న తరువత అన్ని అనుమానాలూ తలెత్తుతాయి’ అంటూ వ్యగ్యంగా రిప్లై ఇచ్చాడు. 

తమ అభిమాన క్రికెట్ల మధ్య ఇలా సరదా సంభాషన నడవడంతో కోహ్లీ, జడేజాల అభిమానులు కూడా సంతోషపడుతున్నారు.

పలువురు నెటిజన్లు తమ స్థాయిలో ఛలోక్తులు కూడా విసురుతున్నారు.

- Advertisement -