అప్పుడే పదేళ్లు.. ధోనీ-సాక్షి వివాహ బంధానికి దశాబ్దం!

- Advertisement -

రాంచీ: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ- సాక్షి వివాహ బంధానికి పదేళ్లు పూర్తయింది. 4 జులై 2010న సాక్షి మెడలో ధోనీ మూడుముళ్లు వేశాడు. శనివారం నాటికి వీరి వివాహ బంధానికి దశాబ్దం పూర్తయింది.

ఈ సందర్భంగా పెళ్లి రోజును పురస్కరించుకొని ధోనీ భార్య సాక్షిసింగ్ ఈ పదేళ్లలో వారి మధ్య చోటు చేసుకున్న మధుర క్షణాలకు సంబంధించిన ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.

- Advertisement -

‘మా వైవాహిక జీవితానికి అప్పుడే పదేళ్లు పూర్తయ్యాయంటే నమ్మలేకపోతున్నా. దశాబ్దకాలంగా ఇద్దరం కలిసి ఆనంద జీవితం గడిపాం. ఎన్నోసార్లు మా మధ్య చిన్న చిన్న గొడవలు జరిగినా సరిదిద్దుకున్నాం.

మా ఇద్దరి జీవితాల్లోకి జీవా రావడం ఓ మధురమైన క్షణం. నిజాయితీగా ఉన్నాం కాబట్టే మా బంధం మరింత బలపడింది. జీవితంలో ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు సాగిపోతున్నామంటే ప్రేమలో ఉన్న గొప్పతనం అర్థమయ్యే ఉంటుంది’ అని ఆ ఫొటోకు కామెంట్‌ చేశారు.

ధోని పెళ్లి రోజు సందర్భంగా బంధువులు, స్నేహితులు, అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. ‘మాకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు.. కష్టకాలంలో మాకు అండగా నిలిచిన బంధువులు, స్నేహితులు, అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నా’ అని సాక్షి పేర్కొన్నారు.

- Advertisement -