అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన ఎంఎస్ ధోనీ, ఆ తరువాత కాసేపటికే సురేష్ రైనా కూడా…

9:23 pm, Sat, 15 August 20
dhoni-raina-announces-retirement-from-international-cricket

ముంబై: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఒక వీడియో సందేశం ఉంచాడు. 

‘‘నా కెరీర్ సాంతం నన్ను ప్రేమించి, మద్దతుగా నిలిచిన మీ అందరికీ ధన్యవాదాలు. 19:29 గంటల నుంచి నేను వీడ్కోలు పలికినట్లుగా భావించండి..’’ అని ఆ సందేశంలో పేర్కొన్నాడు.

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

 

Thanks a lot for ur love and support throughout.from 1929 hrs consider me as Retired

A post shared by M S Dhoni (@mahi7781) on

విచిత్రం ఏమిటంటే.. టీమిండియా క్రికెటర్ సురేష్ రైనా కూడా అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. ధోనీ రిటైర్‌మెంట్ ప్రకటించిన కాసేపటికే రైనా కూడా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో రిటైర్‌మెంట్ ప్రకటించడం విశేషం. 

‘‘ధోనీ.. నీతో కలిసి ఆడడం ఓ మధురానుభూతి. ఈ ప్రయాణంలో నేనూ మీతో చేరాలని నిర్ణయించుకున్నా.. జైహింద్..’’ అని పేర్కొంటూ ధోనీతో కలిసి ఉన్న చిత్రాన్ని ఆ సందేశంలో రైనా జత చేశాడు. 

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

 

It was nothing but lovely playing with you, @mahi7781 . With my heart full of pride, I choose to join you in this journey. Thank you India. Jai Hind! 🇮🇳

A post shared by Suresh Raina (@sureshraina3) on