జెనీలియా పెద్ద మనసు.. వరద బాధితులకు భారీ సాయం

- Advertisement -

ముంబై: తెలుగులో పలు సినిమాల్లో నటించిన జెనీలియా మహారాష్ట్ర వరద బాధితులకు తనవంతు సాయం చేసేందుకు ముందుకొచ్చింది. భర్త రితేశ్‌తో కలిసి ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.25 లక్షల విరాళం ప్రకటించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ను కలిసి చెక్‌ను అందించింది. ఈ విషయాన్ని సీఎం ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

వరదలతో ఇటీవల మహారాష్ట్ర అతలాకుతలమైంది. ఇప్పటికీ పలు ప్రాంతాలు వరద గుప్పిట్లోనే ఉన్నాయి. సంగ్లీ, కొల్హాపూర్, సతార జిల్లాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వరద బాధితుల సహాయార్థం ప్రభుత్వం 432 తాత్కాలిక పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేసింది. మొత్తం 3.78 లక్షల మంది ప్రజలను ఈ కేంద్రాలకు తరలించారు. కాగా, వరదబాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన జెనీలియా దంపతులను సీఎం ఫడ్నవిస్ అభినందించారు.

హాసినిగా చెరగని ముద్ర
తెలుగు ప్రేక్షకుల ‘హాసిని’గా చెరిగిపోని ముద్రవేసిన జెనీలియా మరాఠా నటుడు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాష్‌రావ్ దేశ్‌ముఖ్ తనయుడు రితేశ్ దేశ్‌ముఖ్‌ను పెళ్లాడింది. వివాహం తరవాత జెనీలియా సినిమాలకు దూరమైపోయింది. పెద్ద కుటుంబానికి కోడలిగా వెళ్లిన జెనీలియా అత్తింటి గౌరవం కాపాడేలా చాలా హుందాగా వ్యవహరిస్తోంది. భర్త రితేశ్, కొడుకులు రియాన్‌, రాహిల్‌‌లతో కలిసి జీవితాన్ని సంతోషంగా గడుపుతోంది.

- Advertisement -