మహిళల టీ20 చాలెంజర్‌: చెలరేగి ఆడిన స్మృతి…సూపర్‌ నోవాస్‌పై ట్రయల్ బ్లేజర్స్ విజయం

7:38 am, Tue, 7 May 19
Smriti Mandhana stars as Trailblazers beat Supernovas in a thrilling opener

జైపూర్: పురుషుల ఐపీఎల్ టోర్నీకి ఏ మాత్రం తగ్గకుండా మహిళలు టీ20 చాలెంజర్ టోర్నీ ద్వారా అభిమానులకు అదిరిపోయే ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చారు. సోమవారం మహిళల టీ20 చాలెంజర్‌లో భాగంగా స్మృతి మంధన నేతృత్వంలోని ట్రయల్ బ్లేజర్స్….హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్సీ వహించిన సూపర్ నోవాస్‌పై ఘనవిజయం సాధించింది.

తొలుత ట్రయల్ బ్లేజర్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 140 పరుగులు చేసింది. కెప్టెన్ స్మృతి మంధన కేవలం 67 బంతుల్లో 90 పరుగులు చేసింది. ఇందులో 10 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి.

చదవండి: ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్…హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన టికెట్లు….

ఇక స్మృతితో పాటు హర్లిన్ డియోల్ 36 పరుగులతో రాణించింది. సూపర్ నోవాస్ బౌలర్లలో రాధా యాదవ్ 2 వికెట్లు పడగొట్టింది. అనంతరం 141 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన  సూపర్‌నోవాస్ బ్యాటింగ్ ఆరంభం నుంచి మంచి రన్ రేట్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్లింది. అయితే కీలక సమయాల్లో వికెట్లు కోల్పోవడంతో…చివరి ఓవర్లో 19 పరుగులు చేయాల్సి వచ్చింది.

ఈ దశలో క్రీజులో ఉన్న హర్మన్ 5 బంతుల్లో నాలుగు ఫోర్లు బాది 16 పరుగులు రాబట్టింది. ఇక చివరి బంతికి 3 పరుగులు చేయాల్సిన తరుణంలో…చేతులెత్తేసింది. ఫలితంగా సూపర్ నోవాస్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 138 పరుగులకు పరిమితమై 2 పరుగుల తేడాతో ఓడిపోయింద. మంధన ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచింది.

చదవండి: ప్లే ఆఫ్ లో సన్‌రైజర్స్! కీలక మ్యాచ్ లో చేతులెత్తేసిన కేకేఆర్!