బీసీసీఐ చీఫ్ గంగూలీ చిన్న నాటి కోచ్ అశోక్ ముస్తఫీ కన్నుమూత

8:40 pm, Thu, 30 July 20

కోల్‌క‌తా : టీమిండియా మాజీ సారథి, బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ చిన్ననాటి కోచ్ అశోక్ ముస్తఫీ(86) కన్నుమూశారు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ ఉదయం మృతి చెందారు.

అశోక్ ముస్తఫీ కుమార్తెతో కలిసి లండన్​లో ఉండేవారు. గుండె సంబంధిత సమస్యల కారణంగా ఏప్రిల్​ నుంచి ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ రోజు ఉదయం కార్డియాక్ అరెస్ట్​తో తుదిశ్వాస విడిచినట్టు ముస్తఫీ కుటుంబ సభ్యులు తెలిపారు.

బెంగాల్​కు క్రికెట్ పాఠాలు నేర్పే దుఖీరామ్ క్రికెట్ కోచింగ్ సెంటర్​లో అశోక్​ ముస్తాఫీ ప్రముఖ కోచ్​గా ఉండేవారు. ఆయన వద్ద శిక్షణ తీసుకున్న 12మంది బెంగాల్​ రంజీ క్రికెటర్లుగా ఎదిగారు.

సౌర‌వ్ గంగూలీ చిన్నతనంలో తొలిసారిగా ముస్తాఫీ వద్దే క్రికెట్​లో ఓనమాలు దిద్దాడు. దాదా స్నేహితుడు సంజయ్ దాస్ కూడా ఆయన వద్దే క్రికెట్ శిక్షణ ప్రారంభించాడు.

గత నెల ముస్తఫీ ఆరోగ్యం క్షీణించగా వైద్యానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లను గంగూలీ, సంజయ్ చేశారు.