సంచలనం: శ్రీదేవి మరణం ప్రమాదం కాదు.. హత్యే!: కేరళ జైళ్ల శాఖ డీజీపీ వెల్లడి…

actress-sridevi
- Advertisement -

హైదరాబాద్: అతిలోక సుందరి శ్రీదేవి మరణం ఇప్పటికీ ఒక మిస్టరీయే. ఆమెది సహజ మరణం కాదని, అందులో ఏదో రహస్యం దాగి ఉందనేది ఆమె అభిమానుల భావన. దీనికి కారణం.. ఆమె ఇక్కడ కాకుండా.. ఎక్కడో దుబాయిలో అనుమానాస్పద స్థితిలో మరణించడాన్ని ఒక కారణంగా వారు పేర్కొంటూ ఉంటారు. 

చదవండి: ‘‘జూనియర్ ఎన్టీఆర్‌తో అఫైర్.. మా ఇంట్లో తెలిసింది.. అందుకే సినిమాలకు దూరమయ్యా..’’

బంధువుల పెళ్లి వేడుక కోసం దుబాయ్ వెళ్లిన శ్రీదేవి అక్కడి ఓ స్టార్ హోటల్‌‍లో శవమై తేలడం అప్పట్లో అందరినీ షాక్‌కు గురి చేసింది. శ్రీదేవి మరణంపై విచారణ జరిపిన దుబాయ్ పోలీసులు.. ఇందులో ఎలాంటి కుట్ర కోణం లేదని, ప్రమాద వశాత్తు బాత్ టబ్‌లో పడిపోవడం వల్లనే ఆమె మరణించిందని తేల్చినప్పటికీ.. ఆమె మరణంపై ప్రజల్లో ఇప్పటికీ అనుమానాలు అలాగే మిగిలి ఉన్నాయి. 

ఇన్సూరెన్స్ డబ్బు కోసం హత్య చేశారంటూ…

శ్రీదేవి పేరిట రూ.240 కోట్ల జీవిత బీమా పాలసీ ఉందని, పైగా ఈ పాలసీ ఒమన్ దేశంలో చేయించారని, ఆమె దుబాయ్‌లో మరణిస్తేనే ఆ ఇన్యూరెన్స్ పాలసీని ఎన్‌క్యాష్ చేసుకునే అవకాశం ఉందంటూ అప్పట్లో ప్రచారం జరిగింది.

మొత్తంమీద ఈ వ్యవహారమే శ్రీదేవి హత్యకు దారి తీసిందని ఆరోపిస్తూ గతంలో కొందరు కోర్టుకు కూడా వెళ్లారు.  ఇప్పుడు ఒక డీజీపీ స్థాయి అధికారి ఒకరు తాజాగా శ్రీదేవి మరణం గురించి కొన్ని విషయాలు వెల్లడించడం నిజంగా సంచలనమే!

డీజీపీ రిషిరాజ్ సింగ్ ఏం చెప్పారంటే…

ఈ అనుమానాలకు మరింత బలం చేకూర్చేలా.. తాజాగా కేరళ జైళ్ల శాఖ డీజీపీ రిషిరాజ్ సింగ్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అందరూ భావిస్తున్నట్లు శ్రీదేవి ప్రమాదవశాత్తు బాత్ టబ్‌లో పడి చనిపోలేదని, ఆమె హత్య చేయబడిందని ఆయన వ్యాఖ్యానించారు. రిషిరాజ్ సింగ్ ఇంటర్వ్యూను కేరళకు చెందిన ‘కౌముది’ పత్రిక ప్రచురించింది.

చదవండి: ‘‘మా ఆయనతో సమంత కేక్ కటింగ్.. నేను హర్ట్..’’: శ్రీరెడ్డి తాజా సంచలనం

తన ఫ్రెండ్, ఫోరెన్సిక్ సర్జన్ డాక్టర్ ఉమాదతన్ చెప్పిన విషయాలను డీజీపీ రిషిరాజ్ సింగ్ ఈ సందర్భంగా ఉటంకించారు. ‘‘శ్రీదేవి హత్య చేయబడి ఉంటుందని నా స్నేహితుడు అనడంతో నేను ఆయన్ని మరిన్ని విషయాలు అడిగాను, కొన్ని కీలక ఆధారాలు ఆమెది యాక్సిడెంటల్ డెత్ కాదు, మర్డర్ అని రుజువు చేస్తున్నాయని నా ఫ్రెండ్ చెప్పారు..’’ అని ఆయన పేర్కొన్నారు.

అలా చనిపోయే ఛాన్సే లేదట…

అంతేకాదు, డాక్టర్ ఉమాదతన్ ఒక ఫోరెన్సిక్ సర్జన్. చాలా ముఖ్యమైన కేసులు డీల్ చేశాడు. అతడితో కలిసి నేను కూడా చాలా కేసులకు పని చేశాను.. ఒక వేళ శ్రీదేవి అతిగా మద్యం సేవించినా సరే.. కేవలం ఒక అడుగులోతు నీళ్లలో పడి ఆమె చనిపోయే అవకాశం లేదని నా ఫ్రెండ్ చెప్పారు.?’’ అని రిషిరాజ్ సింగ్ తెలిపారు.

చదవండి: కొత్త వ్యాపారానికి శ్రీకారం చుట్టనున్న.. పూరి జగన్నాథ్, ఛార్మీ!

ఇంకా.. ‘‘వెనక నుంచి ఎవరో ఒకరు తోయకుండా.. ఒక వ్యక్తి కాలు లేదా తల ఒక అడుగు లోతు నీరు ఉన్న బాత్ టబ్‌లో పడటం అసాధ్యం, ఒకవేళ పడినా.. అది మరీ మరణానికి దారి తీసే స్థాయిలో ఉండదు..’’ అని తన స్నేహితుడు, ఫోరెన్సిక్ నిపుణుడైన డాక్టర్ ఉమాదతన్ చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు.

ఇప్పటికీ అనుమానాలే…

దీంతో నటి శ్రీదేవి మరణంపై రిషిరాజ్ సింగ్ చేసిన ఈ వ్యాఖ్యలు మీడియాలో పెను సంచలనంగా మారాయి. ఇప్పటికే శ్రీదేవి మరణంపై ప్రజల్లో చాలా సందేహాలు ఉన్నాయి. ఒక చిన్న బాత్ టబ్‌లో పడి ఆమె చనిపోయిందనే వార్తలను ఎవరూ నమ్మలేక పోతున్నారు.

మొదట్లో ఆమె హార్ట్ ఎటాక్‌కు గురై మరణించిందనే వార్త వెలువడడం, ఆ తర్వాత ఆమె తాగిన మత్తులో బాత్ టబ్‌లో పడి నీటిలో మునిగి చనిపోయిందనే రిపోర్ట్ రావడంతో ఇటు ప్రజలు, అటు ఆమె అభిమానుల్లో ఆమె మరణంపై ఉన్న ఈ అనుమానాలు మరింత ఎక్కువయ్యాయి.

చదవండి: ఆర్య భార్యతో.. అఖిల్ రొమాన్స్!? ఫస్ట్ కాంబినేషన్ ఈసారైనా వర్కవుట్ అవుతుందా?
- Advertisement -