అభిమానులకు నిరాశ.. భారత జట్టు శ్రీలంక పర్యటన వాయిదా

bcci-announces-team-india-for-world-cup-2019
- Advertisement -

న్యూఢిల్లీ: కరోనా కారణంగా భారత జట్టు శ్రీలంక పర్యటన వాయిదా పడింది. శ్రీలంక పర్యటనలో భాగంగా భారత జట్టు జూలైలో 3 వన్డేలు, 3 టీ20 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.

కానీ కరోనా వైరస్ విజృంభిస్తుండడంతో భారత క్రికెటర్లను శ్రీలంక పంపలేమని బీసీసీఐ స్పష్టం చేసింది.

- Advertisement -

ఆటగాళ్ల ఆరోగ్యం దృష్ట్యా పర్యటన ఏర్పాటు చేయలేమని నిస్సహాయత వ్యక్తం చేస్తూ శ్రీలంకలో టీమిండియా పర్యటనను రద్దు చేసింది.

చాలా కాలంగా మ్యాచ్‌లు లేకపోవడంతో అభిమానులు ఈ సిరీస్‌పై ఆశలు పెంచుకున్నారు. అయితే, బీసీసీఐ తాజా పర్యటన వారిని నిరాశకు గురిచేసింది.

అయితే, ఐపీఎల్ నిర్వహణకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తుండడం మాత్రం అభిమానులకు కొంత ఊరటనిచ్చే అంశం.

 
- Advertisement -