కాంగ్రెస్ పోరాటం ఆగదు… ఎంఐఎంకు ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారు?

- Advertisement -

హైదరాబాద్: టీఆర్ఎస్ లో సీఎల్పీ విలీనంపై కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుందన్నారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. హైదరాబాద్ ఇందిరాపార్క్ దగ్గర ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన భట్టి విక్రమార్కను అరెస్ట్ చేయడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు.

చదవండి: భట్టి ఆమరణ దీక్ష భగ్నం…నిమ్స్‌కు తరలింపు

సీఎం కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని .. అసెంబ్లీలో ప్రతిపక్షం ఉండకూడదని.. రాష్ట్రంలో తాము చెప్పిందే వేదంగా మారాలని కుట్రలు పన్నుతున్నారన్నారు. లేదంటే 88 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నా.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎందుకు కొన్నారో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు.

ఈ ఘటనపై టీకాంగ్రెస్ హైకోర్టును ఆశ్రయించినట్లు వెల్లడించారు. మంగళవారం హైకోర్టులో తీర్పును ఆధారంగా న్యాయం కోసం సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర్రాన్ని వ్యతిరేకించిన మజ్లిస్ పార్టీకి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారని ప్రశ్నించారు.

ప్రజాస్వామ్యాన్ని మంటగలుపుతున్న టీఆర్ఎస్ తీరుకు వ్యతిరేకంగా ఈ నెల 11న జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. భట్టి తమ ఒత్తిడితోనే దీక్ష విరమించారని తెలిపిన ఉత్తమ్… టీఆర్ఎస్ సీఎల్పీ విలీనంపై కేసీఆర్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.

- Advertisement -