ఫ్యాన్స్ లేకుండా అంత ఎనర్జీతో క్రికెట్ ఆడలేమన్న సచిన్

ముంబై: కరోనా కారణంగా ఖాళీ స్టేడియాల్లో క్రికెట్ మ్యాచులు నిర్వహించాలంటూ వచ్చిన ప్రతిపాదనపై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పెదవి విప్పాడు.

ఖాళీ స్టేడియాల్లో క్రికెట్ ఆడటం చాలా కష్టంగా ఉంటుందని సచిన్ అభిప్రాయపడ్డాడు. అభిమానులు లేకుండా అంత ఎనర్జీతో ఆడలేమని తేల్చేశాడు.

- Advertisement -

‘స్పీకర్లు పెట్టి సౌండ్ వినిపించాలని కొందరు సలహా ఇవ్వడం విన్నా. కానీ అలా చేసి ఉపయోగం లేదు. స్టాండ్స్‌లో అభిమానులను చూస్తే మనకు స్ఫూర్తి కలుగుతుంది. దాన్నుంచి చాలా శక్తి వస్తుంది. అభిమానుల నుంచే ఆ ఎనర్జీ పొందుతాం’ అని సచిన్ వెల్లడించాడు.

- Advertisement -