అనుష్క హీరోయిన్‌గా నటిస్తే.. నేను హీరోగా నటిస్తా: విరాట్ కోహ్లీ

6:27 pm, Mon, 18 May 20

ముంబై: ఇండియాలోని క్రేజీ కపుల్స్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ జోడీ ఒకటి. కొన్నేళ్లుగా డేటింగ్ చేసిన ఈ జంట ఏడాదిన్నర క్రితం వివాహం చేసుకొని తమ బంధాన్ని మరింత బలపరచుకున్నారు.

ఇక లాక్‌డౌన్ నేపథ్యంలో ఇంటికి పరిమితమైన ఈ ఇద్దరు ఫన్నీ ఫన్నీ వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను ఎంటర్‌టైన్ చేస్తున్నారు.

చదవండి: లాక్‌డౌన్ వేళ.. ధోనీ ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో తెలుసా? మీరే చూడండి…

ఇదిలా ఉంటే తాజాగా ఫుట్‌బాల్‌ కెప్టెన్‌ సునీల్ ఛెత్రీతో విరాట్ దంపతులు లైవ్‌ ఛాట్‌లో పాల్గొన్నారు. అందులో ఛెత్రీ, కోహ్లీని పలు ప్రశ్నలు అడిగాడు.

ఆ క్రమంలో ఒకవేళ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలపై బయోపిక్ వస్తే అందులో కోహ్లీలా నువ్వు నటిస్తావా? అని ఛెత్రీ అడిగాడు. దానికి వెంటనే కోహ్లీ.. ‘‘అనుష్క ఉంటే నేనూ కచ్చితంగా నటిస్తా. నాకు నటన వచ్చు అన్నది అవాస్తవం. ఇంకా నా పాత్రలో నా కంటే బాగా ఎవరు నటించలేరని నా అంచనా. ఒకవేళ అలా ఎవరైనా నటిస్తే నేను పనికిరాని వాడిని అవుతాను’’ అంటూ సరదాగా సమాధానం ఇచ్చాడు.

యాడ్స్‌లో నటించడం ద్వారానే కోహ్లీ, అనుష్క మధ్య పరిచయం ఏర్పడి ఆ తరువాత ప్రేమగా మారింది. ఇక ఇప్పుడు కూడా పలు యాడ్స్‌లో వారిద్దరు కలిసి నటిస్తుంటారు.