ప్రొ కబడ్డీ లీగ్‌: రాహుల్‌, నీలేష్‌ విఫలం.. తెలుగు టైటాన్స్‌కు తొలి ఓటమి

Bengal-Warriors
- Advertisement -

Bengal-Warriors

సోనేపట్‌: ప్రో కబడ్డీ లీగ్‌ 2018లో తెలుగు టైటాన్స్‌కు తొలి ఓటమి ఎదురైంది.  జోన్‌ ‘బి’లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్‌ 25-30 స్కోరుతో బెంగాల్‌ వారియర్స్‌ చేతిలో ఓటమి పాలయింది.  డిఫెన్స్‌లో 13 పాయింట్లతో సత్తా చాటినా కూడా.. స్టార్‌ రైడర్‌ రాహుల్‌ చౌదరి 2 పాయింట్లు,  నీలేష్‌ సోలంకే 5 రైడ్ పాయింట్లుతో ఘోరంగా  విఫలమవడం టైటాన్స్‌ను చాలా దెబ్బ తీసింది.

- Advertisement -

మరోవైపు బెంగాల్‌ వారియర్స్‌ రైడర్‌ మణీందర్‌ సింగ్‌ 11 పాయింట్లతో తమ జట్టు గెలుపులో కీలకపాత్ర పోషించాడు.  మంగళవారం నాటి మ్యాచ్‌లో..  ఆరంభంలో ఇరు జట్లూ డిఫెన్స్‌కే పరిమితం కావడంతో మొదటి అర్థభాగం చాలా చప్పగా సాగింది. 10 నిమిషాల ఆట ముగిసేసరికి బెంగాల్‌ 8-6తో ముందంజలో నిలిచింది. అయితే, నీలేష్‌ విజయవంతమైన రైడ్‌తో స్కోరు 9-9తో సమమైంది.

తర్వాత రైడింగ్‌కు వచ్చిన మహేష్‌ను పట్టేసిన టైటాన్స్‌ 11-9.. ఆ తర్వాత 13-10తో బ్రేక్‌కు వెళ్లింది. మ్యాచ్‌ రెండో అర్థభాగంలో బెంగాల్‌ తమ వ్యూహాని మార్చి ఫలితాన్ని రాబట్టింది.   చివరికి బెంగాల్‌ వారియర్స్‌ మ్యాచ్‌ను 25-30 స్కోరుతో కైవసం చేసుకుంది.

హర్యానా స్టీలర్స్‌పై  జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ గెలుపు…

జోన్‌ ‘ఎ’లో భాగంగా ఉత్కంఠ భరితంగా జరిగిన మరో మ్యాచ్‌లో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ 36–33 స్కోరుతో హర్యానా స్టీలర్స్‌ జట్టును మట్టికరిపించింది.  హర్యానా స్టీలర్స్‌  రైడర్‌ నవీన్‌ 15 పాయింట్లతో ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది.

ప్రొ కబడ్డీ లీగ్‌ 2018లో బుధవారం జరిగే మ్యాచ్‌లు ఇవే…

బెంగళూరు బుల్స్‌ x తమిళ్‌ తలైవాస్,
హర్యానా స్టీలర్స్‌ x యు ముంబా

 

 

- Advertisement -