ప్రో కబడ్డీ లీగ్ 2018: పట్నా పైరేట్స్‌ బోణీ.., మరో మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్‌పై బెంగాల్ వారియర్స్ విజయం

pirates
- Advertisement -

pirates

చైన్నై: డిఫెండింగ్ ఛాంపియన్ పట్నా పైరేట్స్‌ కూడా ప్రో కబడ్డీ లీగ్ 2018 సీజన్‌లో బోణీ కొట్టింది. జోన్- బిలో గురువారం హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో పట్నా 43-41 స్కోరుతో యూపీ యోధాను ఓడించింది. ప్రదీప్ నర్వాల్  చాలా అద్భుతంగా ఆడి 16 పాయింట్లు సాంధించాడు. అలాగే యూపీ యోధా జట్టులో కూడా శ్రీకాంత్ జాదవ్ 12 పాయింట్లు సాధించాడు.

పట్నా పైరేట్స్ డిఫెన్స్ అద్భుతం…

ఈ మ్యాచ్‌లో పట్నా డిఫెన్స్ విభాగం ఎంతో అద్భుతంగా రాణించింది. ఆట మొదలైన రెండు నిమిషాలకే యూపీ 4-1 ఆధిక్యం ప్రదర్శించింది. మూడో నిమిషంలో ప్రదీప్ తన తొలి పాయింట్ సాధించగా పట్నా పైరేట్స్ 3-5కు ఆ ఆధిక్యాన్ని తగ్గించింది. ఈ దశలో రిషాంక్ దేవడిగ 3 పాయింట్లు తేవడంతో యూపీ యోధా మరింత ముందంజ వేసింది.

రెండో రైడ్‌లో ప్రదీప్ నర్వాల్ 3 పాయింట్లు రాబట్టడంతో ప్రత్యర్థి జట్టు ఆధిక్యాన్ని పట్నా పైరేట్స్ ఒక పాయింట్‌కు తగ్గించగలిగింది. అయితే 14వ నిమిషంలో పట్నా పైరేట్స్‌ని ఆలౌట్ చేసి.. యూపీ యోధా 20-15 స్కోరుకు దూసుకుపోయింది.

అయితే తొలి అర్ధభాగం చివరి ఐదు నిమిషాల్లో పట్నాపైరేట్స్ ఆరు పాయింట్లు చేజిక్కించుకొని 21-20 స్కోరుతో ముందంజ వేసింది. రెండో  అర్థభాగంలో ప్రత్యర్థి జట్టును అలౌట్ చేపిన పైరేట్స్ 24-21 స్కోరుతో తన ఆధిక్యాన్ని పెంచుకొంది. ఆట చివరి దశలో రెండు జట్లూ డిఫెన్ప్, అటాకింగ్ గేమ్‌లో అద్భుతంగా రాణించి పాయింట్లు రాబట్టడంతో మ్యాచ్.. నువ్వా-నేనా అన్నట్టు జరిగింది. కానీ చివరకు పట్నా పైరేట్స్‌కే  విజయం దక్కింది.

ఇదే జోన్‌లో జరిగిన మరో పోరులో తమిళ్ తలైవాస్ 27-36 స్కోరు తేడాతో బెంగాల్ వారియర్స్ చేతిలో ఓడింది. సమిష్టిగా రాణించిన బెంగాల్ ముందు తలైవాస్ తేలిపోయింది.

ప్రో కబడ్డీలో శుక్రవారం నాటి మ్యాచ్‌లు…

హర్యానీ స్టీలర్స్  x  గుజారాత్ (రాత్రి 8 గంటల నుండి)
పుణేరి పల్టన్  x  దబాంగ్ ఢిల్లీ (రాత్రి 9 గంటల నుండి)

- Advertisement -