ప్రో కబడ్డీ లీగ్‌ 2018: తమిళ్‌ తలైవాస్‌, హర్యానా స్టీలర్స్‌ మ్యాచ్ ‘డ్రా.’. మరో మ్యాచ్‌లో యు ముంబా విజయం

1:04 pm, Thu, 15 November 18
tamil thalaivas haryana steelers match was ending to draw

tamil thalaivas haryana steelers match was ending to draw

హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్‌లో బుధవారం తమిళ్‌ తలైవాస్‌, హర్యానా స్టీలర్స్‌ మధ్య చివరి దాకా అత్యంతా ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌ చివరికి 32-32తో డ్రాగా ముగిసింది. మొదటి అర్ధభాగంలో 19-15తో తమిళ్‌ తలైవాస్‌పై  హర్యానా స్టీలర్ పైచేయి సాధించినప్పటికీ, రెండవ అర్ధభాగంలో తమిళ తలైవాస్‌ జట్టు పుంజుకుని 27-27 తో ఆ జట్టు స్కోరు సమం చేసింది. ఒక దశలో తమిళ తలైవాస్‌ 31-29తో విజయానికి చాలా చేరువగా వెళ్లింది.

కానీ చివరి మూడు నిమిషాల్లో హర్యానా స్టీలర్స్‌ చక్కటి ప్రదర్శనతో స్కోరు సమం చేసింది. తమిళ తలైవాస్ జట్టులో సుఖేశ్‌ 7 పాయింట్లు, అజయ్‌ ఠాకూర్‌ 6 పాయింట్లతో రాణించగా, హర్యానా స్టీలర్స్ తరఫున వికాస్‌ 14 పాయింట్లుతో ఆడట్టుకున్నాడు.

బెంగళూరు బుల్స్‌పై యు ముంబా విజయం…

ప్రొ కబడ్డీ లీగ్‌లో హోరాహోరీగా సాగిన మరో మ్యాచ్‌లోమ్యాచ్‌లో యు ముంబా 32-29తో బెంగళూరు బుల్స్‌పై విజయం సాధించింది. మొదటి అర్థభాగంలో ముంబా 17-6తో తిరుగులేని ఆధిక్యంలో నిలవగా..  రెండవ అర్ధంభాగంలో బెంగళూరు బుల్స్‌ పుంజుకుని గట్టి పోటీ ఇచ్చింది. కానీ చివరికి విజయం యు ముంబానే వరించింది. దర్శన్‌ 9 రైడ్‌ పాయింట్లతో యు ముంబా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

యు ముంబా జట్టులో దర్శన్‌  9 పాయింట్లు, సురేందర్‌ 5 పాయింట్లు, ఫజల్‌ 5 పాయింట్లుతో రాణించారు. బెంగళూరు బుల్స్ తరఫున పవన్‌ 8 పాయింట్లు, రోహిత్‌  6 పాయింట్లు, కాశిలింగ్‌ 4 పాయింట్లుతో మెరిశారు.