ప్రో కబడ్డీ లీగ్ 2018: యూపీ యోధాపై.. తమిళ్‌ తలైవాస్‌ అద్భుత విజయం!

tamil 5
- Advertisement -

tamil 5

నోయిడా: ప్రో కబడ్డీ లీగ్‌ 2018 సీజన్-6లో తమిళ్‌ తలైవాస్‌ వరుసగా రెండో గెలుపుతో విజయల బాట పట్టింది. శుక్రవారం యూపీ యోధాతో జరిగిన మ్యాచ్‌లో 46-24 భారీ స్కోరు తేడాతో తమిళ్‌ తలైవాస్‌ జట్టు విజయం సాధించింది.  తమిళ్ తలైవాస్  రైడర్లు సుఖేష్‌, అజయ్‌.. చెరో 9 పాయింట్లతో చెలరేగడంతో యూపీ యోధాపై ఆ జట్టు సునాయాసంగా నెగ్గింది.

- Advertisement -

మరోవైపు సొంతగడ్డపై జరిగిన మ్యాచ్‌లో.. యూపీ యోధా జట్టు ఏ దశలోనూ తమిళ్ తలైవాస్‌ జట్టుకి పోటీ ఇవ్వలేకపోయింది. మ్యాచ్‌ ప్రారంభం నుంచే తడబడిన యూపీ జట్టు మొదటి అర్థభాగం ముగిసేసరికే 11-26 పాయింట్లతో వెనుకంజలో నిలిచింది. తలైవాస్‌ జట్టు మొదటి అర్ధభాగంలో సాధించిన ఆధిక్యంతో ఇచ్చిన జోష్‌తో మరింత దూకుడుగా ఆడి.. భారీ అధిక్యంతో విజయం సాధించింది.

ఇక ప్రో కబడ్డీ లీగ్‌లో శుక్రవారం జరిగిన మరో మ్యాచ్‌లో.. జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌పై 25 – 36 స్కోరుతో గుజరాత్‌ ఫార్చ్యూన్‌ జెయింట్స్‌ విజయం సాధించింది.

ప్రో కబడ్డీ లీగ్‌‌లో శనివారం జరిగే మ్యాచ్‌లు…

యు ముంబా x పుణెరి పల్టన్‌

యూపీ యోధా x బెంగళూరు బుల్స్

 

 

- Advertisement -